ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (09:36 IST)

యువతిని బెదిరించి లొంగదీసుకుని అత్యాచారం... నలుగురు అరెస్టు

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్‌ జిల్లాలో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. ఒంటరిగా ఉన్న యువతిని బెదిరించి లొంగదీసుకుని అత్యాచారం చేశారు. దీనిపై బాధితురాలు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. 
 
నిందితుల్లో టీఎస్‌ఎస్పీ నాలుగో బెటాలియన్ కానిస్టేబుల్, ఓ ఎంపీటీసీ భర్త, మరో ఇద్దరు ఉన్నారని నెల్లికుదురు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ వెల్లడించారు. 
 
కాగా, ఈ నెల 17వ తేదీన పాలమూరు జిల్లాలోని ఆలేరు గ్రామానికి చెందిన ఓ యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెల్సిందే. దీంతో మనస్తానికి చెందిన బాధితురాలు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు ముందు తనపై అత్యాచారం చేసిన నలుగురి పేర్లతో సూసైడ్ నోట్ రాసి పెట్టింది. దీంతో పోలీసులు ఆ నలుగురు నిందితులను అరెస్టు చేశారు.