ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 మార్చి 2023 (14:05 IST)

డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన నటి.. పేరేంటి?

కేరళ చిత్రపరిశ్రమకు చెందిన ఓ నటిని డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్, త్రిక్కక్కరాలోని ఉనిచిర థోపిల్ జంక్షన్‌లోని ఓ బహుళ అంతస్తు భవనంలో నటి అంజుకృష్ణ గత కొంతకాలంగా అద్దెకు ఉంటున్నారు. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఆమె బెంగుళూరు నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ తెచ్చి తన అపార్టుమెంటులోనే విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సిటీ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో యోధవ్ స్క్వాడ్ బుధవారం నటి అంజుకృష్ణపై ఇంటిపై దాడి చేశారు. 
 
ఈ క్రమంలో పోలీసులు ఆమె ఇంట్లో 56 గ్రామాల సింథటిక్ డ్రగ్స్ ఎండీఎంఏను గుర్తించి సీజ్ చేశారు. ఇక పోలీసులు రావడంతో నటి స్నేహితుడితో పాటు కొందరు యువతి యువకులు అక్కడిన నుంచి పరారైనట్టు సమాచారం. ఈ ఘటనలో నటి అంజు కృష్ణను పోలీసులు అరెస్టు చేసి డ్రగ్స్ ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె స్నేహితుడు షామీర్‌ కోసం గాలిస్తున్నారు. షామీర్‌తో పరిచయం ఏర్పరచుకున్న అంజుకృష్ణ.. దంపతులమని చెప్పి ఉనిచ్చిరలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.