శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 20 నవంబరు 2023 (14:21 IST)

భార్య కాపురానికి రాలేదన పోలీస్ స్టేషన్ ఎదుట భర్త ఆత్మహత్యాయత్నం

suicide
తనపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను పలుమార్లు బ్రతిమిలాడి కాపురానికి రావాలంటూ కోరినప్పటికీ ఆమె రాకపోవడంతో విరక్తి చెందిన భర్త... తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడకు చెందిన మణికంఠ అనే వ్యక్తి దుర్గ అనే మహిళతో వివాహం జరిగింది. కానీ, కొంతకాలంగా ఈ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో భర్తపై అలిగిన భార్య పుట్టింటింకి వెళ్లిపోయింది. 
 
ఆ తర్వాత పలుమార్లు అత్తారింటికి వెళ్లిన మణికంఠ... భార్యను కాపురానికి రావాలని కోరాడు. ఆమె మాత్రం భర్త మాటను పెడచెవిన పెట్టి, పుట్టింటిలోనే ఉండిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన మణికంఠ చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీన్ని చూసిన పోలీసులు... వెంటనే మణికంఠను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.