బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జనవరి 2025 (18:21 IST)

హత్య కేసులో బెయిల్‌పై బయటకొచ్చి ఇద్దరిని హత్య చేసి లారీ డ్రైవర్!!

murder
భార్య, కుమార్తెను తనను వదిలి వెళ్లిపోవడానికి కారణమైందన్న కోపంతో ఓ మహిళను హత్య చేసిన లారీ డ్రైవర్, ఆ కేసులో బెయిల్‌పై బయటికొచ్చి ఆ మహిళ భర్త, ఆమె అత్తను కూడా హత్య చేసిన ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాలక్కాడ్ జిల్లాకు చెందిన 58 యేళ్ళ చెంతమార అనే వ్యక్తి లారీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. 2019లో తన పక్కింట్లో ఉండే సజిత అనే మహిళను చెంతమార హత్య చేశాడు. భార్య, కుమార్తె తనను వదిలి వెళ్ళిపోవడానికి సజితనే కారణమని భావించి ఆమెపై కోపం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ కేసులో స్థానిక పోలీసులు ఆయనను అరెస్టు చేయగా, ఆ తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. 
 
ఆరు నెలల క్రితం జైలు నుంచి విడుదలైన చెంతమార.. తాజాగా సజిత భర్త సుధాకరన్ (54), ఆయన తల్లి లక్ష్మి (76)ని కూడా హత్య చేశాడు. చెంతమార జైలు నుంచి బయటకు వచ్చినపుడే ఏదైనా ఘాతుకానకి పాల్పడవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వారు అనుమానించినట్టుగానే చెంతమారు మరో ఇద్దరిని హత్య చేసి పరారీపోగా, కేసు నమోదు చేసి అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.