శనివారం, 18 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జనవరి 2025 (19:05 IST)

ఏకాంతంగా ఉన్నపుడు వీడియో తీసేందుకు నిరాకరించిన వ్యభిచారిణి.. చంపేసిన కామాంధులు...

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా పుష్పాలగూడ జంట హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఏకాంతంగా ఉన్నపుడు వీడియో తీసుకునేందుకు వ్యభిచారం చేసే ఓ మహిళ అంగీకరించలేదు. దీంతో ఆమెను హత్య చేశారు. పైగా, ఈ విషయం తెలుసి హెచ్చరించిన ఆమె ప్రియుడుని కూడా కక్షగట్టి చంపేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన కీలక విషయాలను హైదరాబాద్, నార్సింగ్ పోలీసులు తాజాగా వెల్లడించారు. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంకిత్ సాకేత్ ఉపాధి కోసం హైదరాబాద్ నగరంలోని నానక్ రామ్ గూడకు వచ్చాడు. హౌస్ కీపింగ్ పనిచేస్తున్న సమయంలో అతడికి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందు అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటికే ఆమెకు వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. వీరి సంబంధం తెలుసుకున్న బిందు భర్త.. వనస్థలిపురం పరిధిలోని చింతల్ కుంటకు మకాం మార్చాడు. 
 
అయినప్పటికీ బిందు, సాకేత్‌ల మధ్య బంధం కొనసాగింది. ఈ క్రమంలోనే ఆమె సాకేత్ సాయంతో వ్యభిచారం మొదలు పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న మధ్యప్రదేశ్‌కు చెందిన గచ్చిబౌలిలో నివసించే అతడి స్నేహితులు రాహుల్ కుమార్, రాజు కుమార్, సుఖేంద్ర కుమార్‌లు బిందును తమ వద్దకు తీసుకురావాలని చెప్పారు. దీంతో ఆమె జనవరి 8వ తేదీన భర్తకు చెప్పకుండా. సాకేత్‌తో గచ్చిబౌలికి వచ్చి అతడి గదిలోనే ఉంది. 
 
తన భార్య కనిపించకపోవడంతో భర్త ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీస్ స్టేషనులో అదృశ్యం కేసు నమోదైంది. రెండుసార్లు బిందుతో ఏకాంతంగా గడిపిన రాహుల్ కుమార్.. సెల్‌ఫోనులో చిత్రీకరించేందుకు ప్రయత్నించగా ఆమె అడ్డు తెలిపి అంకిత్‌కు చెప్పింది. అతడు రాహుల్‌ను గట్టిగా హెచ్చరించడంతో గొడవ మొదలైంది. దీంతో కక్ష గట్టిన రాహుల్.. బిందు, అంకిత్‌లను హతమార్చాలని నిర్ణయించుకుని రాజ్, సుఖేంద్రల సాయం తీసుకోవాలనుకున్నాడు. 
 
తాము అనుకున్న పథకం ప్రకారం రాహల్ ఈ నెల 11వ తేదీన అంకిత్ ద్వారా బిందును మరోసారి పిలిపించుకున్నాడు. అదేరోజు రాహుల్, రాజ్, సుఖేంద్రలు సాకేత్, బిందులను ఆటోలో పుప్పాలగూడ అనంత పద్మస్వామి గుట్టల్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అందరూ మద్యం తాగుతుండగా సుఖేంద్ర బిందును పక్కకు తీసుకెళ్లాడు. 
 
అంకిత్ ఒంటరిగా ఉండడంతో అదేఅదనుగా భావించిన రాహుల్, రాజు కుమార్‌లు కత్తితో పొడిచి బండరాయితో కొట్టి చంపారు. ఆ తర్వాత బిందును హతమార్చారు. అనంతరం నిందితులు 12న మధ్యప్రదేశ్‌లోని సొంతూరికి పారిపోయారు. సెల్ ఫోన్ సిగ్నల్స్, ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితుల ఆచూకీ గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని మధ్యప్రదేశ్‌కు పంపించగా ముగురూ చిక్కారు.