గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (15:48 IST)

పుట్టిన రోజు వేడుక పేరుతో ప్రియురాలికి నిప్పంటించిన ప్రియుడు

fire accident
పుట్టిన రోజు వేడుక పేరుతో ప్రియురాలికి ప్రియుడు నిప్పంటించాడు. ఆ తర్వాత తాను కూడా నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లా కొల్లెంగోడ్ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం (23) అనే యువకుడు 16 యేళ్ల యువతిని ప్రేమించాడు. ఈ విషయం ఇంట్లో తెలిసిన ఇరు కుటుంబాల సభ్యులు అడ్డు చెప్పారు. పెద్దల మాటలను జీర్ణించుకోలేని ప్రియుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. తనతో పాటు తన ప్రియురాలిని కూడా చంపాలని ముందుగానే ప్లాన్ చేశాడు. 
 
ఈ క్రమంలో తన పుట్టిన రోజు వేడుకకు రావాలంటూ ప్రేయసిని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆ బాలిక రాగానే గదిలోకి తీసుకెళ్లి నిప్పంటించాడు. ఆపై తాను కూడా నిప్పంటించుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన యువకుడి తల్లి, సోదరుడు వారిద్దరిని రక్షించి త్రిశూర్ వైద్య కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అయితే, వారి శరీరాలు బాగా కాలిపోవడంతో వారుద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.