1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 మే 2025 (10:45 IST)

మహిళతో సహజీవనం... కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలంటూ వేధింపులు...

victim girl
ఓ మహిళతో సహజీవనం చేస్తూ వచ్చిన ఓ కామాంధుడు ఆమె కుమార్తెపై కన్నేశాడు. ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలంటూ వేధించసాగాడు. ఈ వేధింపులను భరించలేని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 
 
తెలంగాణ రాష్ట్రంలోని అనపర్తి మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత భర్త 2016లో మృతిచెందారు. పి.నాగిరెడ్డి అనే వ్యక్తితో ఆమెకు పరిచయం పెరిగి సహజీవనం సాగించారు. ఆ మహిళ కుమార్తెను వివాహం చేసుకుంటానని ఆమెను వేధిస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో మరో బాలికను వివాహం చేసుకోగా వారికి ఓ బిడ్డ జన్మించింది. తర్వాత భార్యా బిడ్డలను వదిలేసిన నాగిరెడ్డి.. గతంలో సహజీవనం చేసిన మహిళ వద్దకు మళ్లీ వచ్చి ఆమె కుమార్తెతో పెళ్లి జరిపించాలంటూ ఇరువురిని కొడుతూ వేధించేవాడు. దీంతో పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశానని.. స్టేషన్ వద్ద నాగిరెడ్డి తల్లి తన కుమార్తెపై దాడిచేసి తీవ్రంగా కొట్టిందని వాపోయారు. 
 
అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించానని ఆమె తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.