1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 16 మే 2024 (11:37 IST)

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

suicide
శ్రీశైలం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకోవడంపై కలకలం రేగింది. శివశంకర్ రెడ్డి అనే కానిస్టేబుల్‌ తుపాకీతో తలపై కాల్చుకుని స్టేషన్‌లోనే శవమై కనిపించాడు. ఈ సంఘటన తెల్లవారుజామున స్టేషన్‌లోని బాత్‌రూమ్‌లో జరిగింది. అతడు రక్తపు మడుగులో పడి వున్నాడు.
 
కానిస్టేబుల్ మరణవార్త తెలిసిన వెంటనే ఆత్మకూరు డీఎస్పీ విచారణకు ఆదేశించారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసేందుకు కేసు దర్యాప్తును సీఐ ప్రసాదరావుకు అప్పగించారు. మృతి చెందిన కానిస్టేబుల్ శివశంకర్ రెడ్డి కర్నూలు జిల్లా వాసి. ఐతే అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ విషాద సంఘటనకు దారితీసిన కారణాలను కనుగొనే పనిలో ఉన్నారు పోలీసులు.