శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

చైన్ స్నాచింగ్‌కు పాల్పడి... మహిళ గొలుసును మింగేసిన యువకుడు..

thieves
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ యువకుడు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆ గొలుసును మింగేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో సల్మాన్, జాఫర్ అనే ఇద్దరు యువకులు దొంగతనాలకు పాల్పడేవారు. వీరిద్దరూ దిబిహ్ వంతెన సమీపంలో రోడ్డు మీద వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాగేశారు. 
 
దీంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో పక్కనే ఉన్న పోలీసులు ఆ కేకలు విని... బైక్ మీద పారిపోతున్న దొంగలను కిలోమీటరు దూరం వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. తాము దొంగతనం చేయలేదని తప్పించుకునేందుకు సల్మాన్ చోరీ చేసిన బంగారు గొలుసును మింగేశాడు. 
 
వెంటనే అతణ్ని రాంచీ లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి స్కానింగ్ చేయగా, నిందితుడి ఛాతీ భాగంలో బంగారు గొలుసు ఇరుక్కుపోయినట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఆ గొలుసు ఎక్కువ సేపు ఉంటే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో ఆపరేషన్ చేసి వెలికి తీశారు.