శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 మే 2023 (18:38 IST)

ది కేరళ స్టోరీ దర్శకుడికి అస్వస్థత.. డీహైడ్రేషన్‌తో ఆస్పత్రిలో..

the kerala story
ది కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్తో సేన్ అస్వస్థతకు గురైయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. డీ-హైడ్రేషన్, ఇన్ఫెక్షన్ల కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరారని.. ప్రమోషన్‌లలో పాల్గొన్న అస్వస్థతకు గురైనట్లు ఆయనే సుదీప్తో సేన్ స్వయంగా వెల్లడించారు.
 
అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇక "ది కేరళ స్టోరీ" సినిమాలో ఆదా శర్మ, యోగితా బిలానీ, సోనియా, సిద్ది ఇధ్నాని ప్రధాన పాత్రల్లో నటించారు.
 
ఇప్పటివరకు 200 కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. కేరళ రాష్ట్రంలో అమ్మాయిలను బలవంతంగా మతం మార్పించి.. వారిని తీవ్రవాదులుగా ఎలా మార్చారనే అంశంతో ది కేరళ స్టోరీస్ తెరకెక్కింది.