1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మే 2023 (14:38 IST)

హీరోయిన్ ఆదాశర్మ ఇక్కట్లు.. ఫోన్ నెంబర్ లీక్.. వేధింపులు మొదలు

Adah Sharma
హీరోయిన్ ఆదాశర్మ ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ఆమె పర్సనల్ డేటా నెట్టింట లీక్ కావడంతో ఆమెను వేధించే వారి సంఖ్య పెరిగిపోతోంది. హార్ట్ ఎటాక్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆదాశర్మ.. ది కేరళ స్టోరీ చిత్రంలో నటించి మరింత పేరు తెచ్చుకుంది. 
 
ఈ సినిమా ఇప్పటికే రూ.200 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను కొన్ని రాజకీయ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఆదాశర్మను టార్గెట్ చేశాడు. ఆమె వ్యక్తిగత వివరాలు లీక్ చేశాడు. దీంతో ఆమె ఫోన్ నెంబర్ లీక్ కావడంతో ఆమెకు ఫోన్లు వెల్లువెత్తుతున్నాయి. 
 
వేధింపులు మామూలుగా వుండట్లేదు. మరోసారి మస్లింలకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తే పర్యవసాలు ఇంకా దారుణంగా వుంటాయని హెచ్చరించాడు. దీంతో సదరు వ్యక్తిపై ఆదా శర్మ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేసింది.