గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 మే 2023 (21:37 IST)

నేను ఆమె అండర్ వేర్ చూడాలి.. ప్రియాంక చోప్రా షాక్!

priyanka chopra
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన కెరీర్‌ ఆరంభంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. ఓ సినిమా కోసం సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో దర్శకుడు తన అండర్ వేర్ చూడాలని వుందని చెప్పినట్లు ప్రియాంక చోప్రా వెల్లడించింది. 
 
ఏ సందర్భంలో అతడు ఆ మాట అన్నాడో కూడా ప్రియాంక చోప్రా వివరించింది. 2002-03 నాటి ఘటన ఇదని ప్రియాంక చోప్రా వెల్లడించింది. తాను ఒక అండర్ కవర్ ఏజెంట్‌ అని.. శృంగారపరంగా ఓ వ్యక్తిని రెచ్చగొట్టేలా నటించాలి. ఆ సన్నివేశాలలో తాను శరీరంపై కొద్ది మేర దుస్తులు తొలగించాల్సి వుంటుంది. 
 
అప్పుడు ఆ డైరక్టర్ వచ్చి.. వద్దు.. తాను ఆమె అండర్ వేర్ చూడాలనుకుంటున్నానని చెప్పాడు. ఇలాంటివి లేకపోతే ఈ సినిమా చూడ్డానికి ఎవరు వస్తారన్నాడు. దీంతో షాకయ్యానని తెలిపింది. తన కెరీర్‌లో ఇదొక అమానవీయ ఘటన అంటూ ప్రియాంక చోప్రా వివరించింది. ఇకపోతే.. ప్రియాంక చోప్రా ఇటీవల సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే.