శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మే 2023 (22:18 IST)

పెళ్లి భోజనం వికటించడంతో అస్వస్థతకు గురైన 20మంది

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో పెళ్లి భోజనం వికటించడంతో దాదాపు 20 మందికి అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం గుంతకందాల గ్రామంలో పెళ్లికి  వచ్చిన అతిథులు కలుషితాహారం తినడం వల్ల 20 మంది అతిథులకు ఫుడ్ పాయిజనింగ్ అయింది. 
 
అలాగే వెలుగోడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.