గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 23 మే 2023 (16:39 IST)

ఆంధ్ర ప్రదేశ్‌‌లో టార్క్ మోటార్స్, గుంటూరులో కొత్త ఎక్స్‌పీరియన్స్ జోన్‌ ప్రారంభం

image
భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ తయారీదారు TORK మోటార్స్ తమ మొదటి ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను గుంటూరులో ప్రారంభించింది. ఇది అమరావతి రోడ్, ప్రభుత్వ ఫీవర్ హాస్పిటల్ ఎదురుగా, గోరంట్ల ప్రాంతంలో ఉంది. ఈ 3S సౌకర్యం ఈ ప్రాంతంలోని కస్టమర్‌లు, ఔత్సాహిక కస్టమర్లకు అమ్మకాలు మరియు అమ్మకాల తర్వాత సేవలను కూడా అందించగలదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపెనీ మొదటి భౌతిక షాప్‌గా నిలుస్తుంది.
 
ఈ పూర్తి సరికొత్త ఎక్స్‌పీరియన్స్ జోన్ TORK మోటార్స్ ఇటీవల విడుదల చేసిన, నవీకరించిన KRATOS-R మోటర్‌సైకిల్‌ను ప్రదర్శిస్తుంది. ఇది ఇప్పటికే ఉన్న, అలాగే సంభావ్య క్లయింట్‌ల అమ్మకాల తర్వాత అన్ని అవసరాలను తీర్చటానికి ప్రత్యేక జోన్‌ను కూడా కలిగి ఉంది. ఈ జోన్ ప్రారంభోత్సవం సందర్భంగా, TORK మోటార్స్ వ్యవస్థాపకుడు-సిఈఓ శ్రీ కపిల్ షెల్కే మాట్లాడుతూ, "నగరంలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌పై పెరుగుతున్న ఆసక్తిని తీర్చడానికి గుంటూరులో మా మొదటి ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది.
 
మా లక్ష్యం  మా అధిక-పనితీరు గల ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌తో లీనమయ్యే, తొలి అనుభవాలను అందించటమే. ఔత్సాహికులు మరియు సంభావ్య కస్టమర్‌లు Kratos R యొక్క పనితీరును దగ్గరగా చూసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ప్రముఖ మార్కెట్‌లలో TORK ఎక్స్‌పీరియన్స్ జోన్‌లను పరిచయం చేయాలనే ప్రణాళికలతో మేము దేశవ్యాప్తంగా మా టచ్‌పాయింట్‌లను విస్తరింపజేస్తూనే ఉన్నాము. మా విస్తరణ ప్రణాళికలు ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహన రంగం లో అత్యుత్తమ, స్థిరమైన మరియు ఆచరణాత్మక రవాణాను నిర్ధారించే విధంగా  ఉన్నాయి "అని అన్నారు.