ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 మే 2023 (10:56 IST)

ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి

ఏపీలో ఓ వైపు ఎండలు.. అక్కడక్కడా వానలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిన్న ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాలు, విజయనగరం, కోనసీమ, కృష్ణ, సత్యసాయి, జిల్లాల్లో పిడుగులతో వర్షం పడింది. మహారాష్ట్రలోని విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కర్ణాటక మీదుగా ద్రోణి ఉంది. 
 
దీని వల్ల ఇవాళ శ్రీకాకుళం, అనకాపల్లి అల్లూరి కడప, సత్యసాయి, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కొద్దిగా వర్షం పడుతుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. 
 
మంగళవారం అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో మోస్తరు వానలు పడొచ్చని వాతావరణ అధికారులు అంచనా వేశారు.