శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 మే 2023 (12:09 IST)

ప్రకాశం జిల్లా అర్ధవీడు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం

tiger
ప్రకాశం జిల్లా అర్ధవీడులో పెద్దపులి సంచారం ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. దీంతో వారు భయంతో వణికిపోతున్నారు. ఈ జిల్లాలోని కంభం చెరువు వద్ద పులి వచ్చి నీరు తాగి వెళ్లడానని ఓ గొర్రెల కాపరి చూశాడు. ఈ విషయాన్ని గ్రామస్థులకు చెప్పగా, వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో వారు అప్రమత్తమయ్యారు. రాత్రి వేళల్లో ప్రజలు బయట తిరగవద్దని సూచించారు.

15 రోజులుగా ఎండలు, వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో నల్లమల అటవీ ప్రాంతంలోని కుంటలు, వాగులు ఎండిపోయాయి. దీంతో అడవిలోని వన్యప్రాణులు రాత్రి వేళ జన సంచారంలేని సమయంలో సమీపంలోని కంభం చెరువు వద్దకు వస్తున్నాయి. దాహం తీర్చుకొని తిరిగి వెళుతున్నట్టుగా గుర్తించారు.

ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం అడవి సమీపంలోని నల్లకొండ మీదుగా ఆర్ధవీడు మండలం నాగులవరం, మోహిద్దీన్‌పురం గ్రామాల మధ్య రహదారిని దాటుకొని కంభం చెరువు వద్దకు పెద్దపులి వచ్చింది.

దాహార్తి తీర్చుకొని తిరిగి వెలుగొండ ప్రాజెక్టు తూర్పు ప్రధాన కాలువ మీదుగా నల్లకొండ దిగి వెళ్లింది.

దీన్ని గమనించిన ఓ గొర్రెల కాపరి గ్రామస్తులకు విషయం తెలియజేశాడు. దీంతో భయందోళనకు గురైన నాగులవరం ప్రజలు పెద్దపులి సంచరిస్తున్న విషయాన్ని అటివీ శాఖ అధికారులకు తెలిపారు.

దీంతో అప్రమత్తమైన అధికారులు.. కంభం చెరువు ప్రాంతంలో పరిశీలించగా, అక్కడ పెద్ద పులి పాదముద్రలు గుర్తించారు ఎండలకు అడవిలో నీరు లభించకపోవడంతో పెద్దపులి దాహం తీర్చుకొనేందుకు చెరువు వద్దకు వచ్చి తిరిగి అడవిలోకి వెళ్లిందని, ప్రజలు రాత్రి వేళ బయట తిరగ వద్దని వారు సూచించారు.