1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (16:22 IST)

స్పాట్ వాహన బీమా : ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం

insurance policy
ఇకపై బీమా లేకుండా రోడ్డు పైకి వచ్చే వాహనాలు పట్టుబడితే అక్కడికక్కడే బీమా చేయించేలా (స్పాట్ ఇన్సూరెన్స్) కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను రూపొందిస్తుంది. ఈ విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకుని రావాలని కోరుతోంది. అలాగే బీమా లేని వాహనాలను గుర్తించేందుకు ప్రత్యేక పరికరాన్ని ఆవిష్కరించనున్నారు. దేశంలో నానాటికీ వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అలాగే, దేశ వ్యాప్తంగా సాగుతున్న ప్రమాదాల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఇలాంటి ప్రమాద సమయంలో బీమా సదుపాయం లేకపోవడంతో థర్డ్‌ పార్టీకి పరిహారం అందించే వీలు లేకుండా పోతోంది., ఈ క్రమంలోనే బీమా సౌకర్యం లేకుండా పట్టుబడిన వాహనాలకు ఆ స్పాట్‌లోనే ఇన్సూరెన్స్‌ చేయించేలా కేంద్రం భావిస్తుంది. 
 
ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లపై పలు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే అంశంపై జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఇప్పటికే పలు సూచనలు చేసింది. ముఖ్యంగా, జాతీయ రహదారులపై తిరిగే వాహనాలకు ఖచ్చితంగా బీమా సదుపాయం ఉండేలా చూడాలని కేంద్ర రవాణా శాఖకు కౌన్సిల్ సూపించింది. బీమాకు అయ్యే డబ్బును సదరు వాహన యజమాని ఫాస్ట్ ట్యాగ్ నుంచి మినహాయించుకునేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. అలాగే, బీమాలోని వాహనాలను కూడా గుర్తించేందుకు వీలుగా ఓ పరికరాన్ని ఆవిష్కరించనున్నారు.