మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (08:17 IST)

ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి Z-ప్లస్ భద్రత అందించాలి.. సుప్రీం

mukesh ambani
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు అత్యున్నత స్థాయి Z-ప్లస్ భద్రతను అందించాలని మహారాష్ట్ర రాష్ట్రం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. 
 
భద్రతాపరమైన ముప్పు ఉన్నట్లయితే, భద్రతను నిర్దిష్ట ప్రదేశానికి పరిమితం చేయలేమని వారు పేర్కొన్నారు. అంబానీల భద్రత భారతదేశం అంతటా అందుబాటులో ఉంటుంది. అదనంగా, అంబానీలు విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు, భారత ప్రభుత్వ విధానం ప్రకారం అత్యున్నత స్థాయి Z భద్రతను అందించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ధారించాలి.
 
దేశంతో పాటు విదేశాల్లోనూ ఈ భద్రత వుంటుంది. భారతదేశం లేదా విదేశాలలో అంబానీలకు Z సెక్యూరిటీని అందించడానికి అయ్యే మొత్తం ఖర్చు వారే భరించాలని సుప్రీం కోర్టు నొక్కి చెప్పింది. 
 
ముంబైలో అంబానీ, అతని కుటుంబ సభ్యులకు భద్రత కల్పించడానికి కేంద్రాన్ని అనుమతించే జూలై 22, 2022 నాటి ఉత్తర్వులపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ పిటిషనర్ బికాష్ సాహా దాఖలు చేసిన దరఖాస్తుకు ప్రతిస్పందనగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.