ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (14:18 IST)

భారత మార్కెట్‌లోకి Xiaomi 13 సిరీస్.. ఫీచర్స్

Xiaomi 13 Pro
Xiaomi 13 Pro
Xiaomi 13 సిరీస్ మార్కెట్లోకి విడుదలైంది. Xiaomi 13 డిసెంబర్ 2022లో చైనాలో విడుదలైంది.  
తాజాగా భారతదేశంలో, ఇప్పటివరకు కంపెనీ Xiaomi 13 ప్రోని విడుదల చేసింది. యూఎస్‌లో మాత్రం ఈ ఫోను అందుబాటులోకి రాదు. అయితే UK,యూరప్, ఆసియాలోని ఇతర ప్రాంతాలలో అందుబాటులో ఉంటుంది. 
 
Xiaomi 13 Pro భారతదేశంలో వచ్చే నెల నుంచి అమేజాన్ వెబ్‌సైట్‌లో లభ్యమవుతుంది. ఈ ఫోన్ అత్యంత శక్తివంతమైన ఆండ్రాయిడ్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 
 
Xiaomi 13 Pro Qualcomm నుండి సరికొత్త Snapdragon 8 Gen 2 చిప్‌సెట్‌పై నడుస్తుంది.
 
ఇది ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన Android SoC
Samsung (Galaxy S23 సిరీస్),
OnePlus (OnePlus 11 Pron) నుండి వచ్చిన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు కూడా అదే ప్రాసెసర్‌పై పనిచేస్తాయి.
 
Galaxy S23 సిరీస్‌కు శక్తినిచ్చే స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌లు ఫోన్‌ల కోసం అనుకూలీకరించబడి ఉన్నాయని శామ్‌సంగ్ తెలిపింది.
తాజా వెర్షన్ -- Android 13 ఆధారంగా MIUI 14పై రన్ అవుతుంది.