అమిత్ షా 'బాహుబలి' బాణం ఎవరిపైకి? నేనే 'బాద్ షా' అంటున్న కేసీఆర్, పవన్ మాటేంటి?
ఉత్తరాది రాష్ట్రాలన్నీ ఒక పార్టీ వైపు మొగ్గు చూపితే చాలు... దక్షిణాది ప్రాంతీయ పార్టీలన్నీ గగ్గోలు పెట్టినా ఏమీ కాదు. ఉత్తరాది రాష్ట్రాల్లో సింహభాగం రాష్ట్రాల్లో భాజపా అధికారంలో వుంది. ఈ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో కూడా కమలం పార్టీ బంపర్ మెజార్టీతో
ఉత్తరాది రాష్ట్రాలన్నీ ఒక పార్టీ వైపు మొగ్గు చూపితే చాలు... దక్షిణాది ప్రాంతీయ పార్టీలన్నీ గగ్గోలు పెట్టినా ఏమీ కాదు. ఉత్తరాది రాష్ట్రాల్లో సింహభాగం రాష్ట్రాల్లో భాజపా అధికారంలో వుంది. ఈ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో కూడా కమలం పార్టీ బంపర్ మెజార్టీతో గెలవడం ఖాయం అని ఇప్పుడే లెక్కలు చెప్పేస్తున్నారు. దీనితో కమలనాథుల్లో రెట్టించిన ఉత్సాహం కట్టలు తెంచుకుంటోంది. దానితో ఇక ఉత్తరాదిపై ఫోకస్ తగ్గించి దక్షిణాదిపై సారించారు.
ఈ క్రమంలో అమిత్ షా తొలుత తెలంగాణలో పర్యటించి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కే హీట్ పుట్టించారు. ఎవరెన్ని మాట్లాడినా అంతగా పట్టించుకోని కేసీఆర్, అమిత్ షా మాటలకు ఉలిక్కిపడ్డారు. అమిత్ షా పర్యటన కూడా గ్రామాలు, ఇంటింటికి ప్రచారం చందంగా సాగడంతో టి.భాజపాలో కొత్త వూపు వచ్చినట్లు కనబడింది. దీనితో కేసీఆర్ కాస్త అప్రమత్తమయ్యారు. ఇక్కడ అమిత్ షా చెప్పినవన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పారు.
తెలంగాణకు ఎంతమంది అమిత్ షాలు వచ్చినా ఈ గడ్డకు తనే బాద్ షా అని కూడా అనేశారు. ఆ స్థాయిలో కేసీఆర్ కు మంటపుట్టించారంటే... రానున్న రెండేళ్లపాటు అమిత్ షా కాలికి బలపం కట్టుకుని తెలంగాణలో తిష్ట వేశారంటే తేడా వస్తుందనడంలో సందేహం లేదు. అందుకేనేమో కేసీఆర్ అప్రమత్తమయ్యారు. అమిత్ షాపై విమర్శల దాడితో ఫైర్ అయ్యారు. ఇకపోతే ఏపీ సంగతి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వున్న తెదేపా తమ మిత్రపక్షమని అమిత్ ఇప్పటికే ప్రకటించారు. ఒకవేళ సొంతంగా వెళ్లాలన్నప్పటికీ ఇక్కడ భాజపాకు అంత సీన్ లేదని లెక్కలు చెపుతున్నాయి. అలాగే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ భాజపాకు అంత బలం లేదు. కర్ణాటక ఏమవుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం.
కాబట్టి దక్షిణాదిలో భాజపాకు బలం అంతగా లేదన్నది నిజం. ఐతే ఉత్తరాది మొత్తంగా మోదీ వెనుకే వున్నది కనుక వచ్చే 2019 ఎన్నికల తర్వాత కూడా నరేంద్ర మోదీనే ప్రధాని అవుతారు. ఇక్కడ దక్షిణాదిన నిధులు బాబోయ్ అని ఎంత మొత్తుకున్నా వాళ్లు విదిల్చేదే రాలుతుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చూడాల్సి వుంది.