శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మే 2022 (11:48 IST)

టిప్పు సుల్తాన్ అమర్ రహే ! యుద్ధభూమిలో రాకెట్లు.. ఆంగ్లేయులకే చుక్కలు

Tippu sultan
Tippu sultan
18వ శతాబ్దంలో బ్రిటిష్‌వారితో పోరాడుతూ యుద్ధ రంగంలో కన్నుమూసిన ఏకైక భారత పాలకుడు టిప్పు సుల్తాన్. బ్రిటిష్, మరాఠా, హైదరాబాద్ నిజాంల సంయుక్త బలగాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప దేశభక్తుల్లో టిప్పు ఒకరు.  
 
టిప్పు సుల్తాను కోలారు జిల్లా దేవనహళ్ళిలో జన్మించారు.  అతని తండ్రి హైదర్ అలీ మైసూరును పరిపాలించెడివారు. అతని తల్లి ఫాతిమా కడప కోట గవర్నరు నవాబ్ మొయినుద్దీన్ కుమార్తె. అతను 1750 నవంబరు 20 లో జన్మించారు.
 
టిప్పూ సుల్తాన్, అతని తండ్రి హైదర్ ఆలిచే నియమించబడ్డ ఫ్రెంచ్ అధికారుల వద్ద యుద్ధవిద్యలు అభ్యసించారు. 1766 లో తన పదహేనవ యేట తన తండ్రితో కలసి మొదటి మైసూరు యుద్ధంలో పాల్గొన్నారు.  1775 - 1779 మధ్య జరిగిన మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధంలో తన వీరత్వాన్ని ప్రదర్శించారు. 1792లో లోహపు కవచాలు గల రాకెట్లను (తగ్రఖ్) టిప్పూ సుల్తాన్ తన సైనికాదళంలో విజయవంతంగా ఉపయోగించారు.  వీటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకొని, రాకెట్ రంగంలో తమ ప్రయోగాలను ప్రారంభించారు.
 
1789లో బ్రిటీష్‌వారి మిత్రరాజ్యమైన ట్రావెన్‌కోర్‌ను స్వాధీనం చేసునేందుకు టిప్పు విఫలయత్నం చేశారు, ఈ పరాజయాన్ని టిప్పు సుల్తాన్ జీర్ణించుకోలేకపోయారు, అతి పరిమిత సంఖ్యలో ఉన్న ప్రత్యర్థి సైన్యం నుంచి ఎదురైన కాల్పులతో టిప్పు సైన్యం భయభ్రాంతులకు గురైంది, దీని ఫలితంగా మూడో ఆంగ్లో-మైసూర్ యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభంలో బ్రిటీష్‌వారికి విజయాలు దక్కాయి, వారికి కోయంబత్తూరు జిల్లా స్వాధీనమైంది, అయితే టిప్పు ప్రతిదాడిలో వారు స్వాధీనం చేసుకున్న అనేక భూభాగాలను కోల్పోయారు. 
 
1799లో జరిగిన నాలుగో ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నాన్ని రక్షించడం కోసం యుద్ధం చేస్తూ మే 4న మరణించారు. దీంతో మైసూర్ రాజ్యం స్వాతంత్ర్యానికి పూర్తిగా తెరపడింది.