శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : గురువారం, 26 జనవరి 2017 (14:22 IST)

టిటిడి ఛైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట..!

నిజమే.. మీరు వింటున్నది. అప్పుడెప్పుడూ జగపతిబాబు నటించిన శుభాకాంక్షల సినిమాలో ఇద్దరి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవతో వారి ఇళ్ళ మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న సన్నివేశాలు చూసి ఉంటాం. అలాంటిదే సే

నిజమే.. మీరు వింటున్నది. అప్పుడెప్పుడూ జగపతిబాబు నటించిన శుభాకాంక్షల సినిమాలో ఇద్దరి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవతో వారి ఇళ్ళ మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న సన్నివేశాలు చూసి ఉంటాం. అలాంటిదే సేమ్ టు సేమ్ తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిలకు మధ్య జరుగుతోంది. ఇది ఇప్పటిది కాదు. మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ మరణించకముందు నుంచీ వీరి మధ్య వైరం కొనసాగుతోంది. కారణం దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ పార్టీ మారి తెలుగుదేశం పార్టీకి రావడమే. అసలు వీరి మధ్య ఇంత వైరం ఎందుకు.
 
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే ఈ రెండు పదవులు ప్రాముఖ్యత కలిగినవే. ఒకటేమో నామినేటెడ్, మరొకటి ప్రజాప్రతినిధి. అయితే రెండూ తిరుపతి నగరానికి ముఖ్యమైన పదవులే. కానీ వీరిద్దరు ఎప్పుడూ ఏ కార్యక్రమానికి వెళ్ళినా కలవరు. అంతా పైపై నమస్కారాలు. ఆ తర్వాత అంతర్గత కుమ్ములాటలు. కారణం ముందు నుంచి వీరి కుటుంబం మధ్య ఉన్న వైరమే. 
 
దివంగత నేత వెంకటరమణ సతీమణి సుగుణమ్మ. ఈమె భర్త మరణం తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. వెంకటరమణ మొదట్లో కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసి ఆ తరువాత మెల్లగా టిడిపిలోకి దూకారు. అప్పటికే టిడిపిలో తిరుపతి ఎమ్మెల్యే సీటు కోసం వేచి చూస్తున్న చదలవాడ వెంకటరమణ పార్టీలో చేరడాన్ని వ్యతిరేకించారు.
 
పార్టీకి దూరంగానే ఉంటూ వచ్చారు. అయితే చంద్రబాబు చదలవాడకు హ్యాండ్ ఇవ్వకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే తితిదే ఛైర్మన్ అన్నారు. అనుకున్న విధంగా పదవి ఇచ్చారు. కానీ వీరి మధ్య అప్పట్లో ఏర్పడిన వైరం ఇప్పటికీ ఉంది. కారణం ఎన్నికల్లో వెంకటరమణకు ఏ రకంగానూ చదలవాడ సహాయం చేయకపోవడమే. ఏకంగా పార్టీ అధినేతే అభ్యర్థికి సహాయం చేయమని చెప్పినా ఆయన ఒప్పుకోలేదు. ఎలాగోలా కష్టపడి వెంకటరమణ గెలిచాడు.
 
ఒకవైపు తనను సహకరించకపోగా, గెలిచిన తరువాత కూడా తనపై చెడు ప్రచారం చదలవాడ చేయడంతో వెంకటరమణ కుటుంబ సభ్యులకు చదలవాడ కృష్ణమూర్తికి మధ్య వైరం పెరిగింది. అయితే వెంకటరమణ అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తరువాత ఆ స్థానంలో సుగుణమ్మ నిలబడ్డారు. గెలిచారు. వెంకటరమణ మరణించినా వీరి రెండు కుటుంబాల మధ్య ఉన్న వైరం మాత్రం అలాగే కొనసాగుతోంది. ఇప్పటికీ కూడా తితిదే ఛైర్మన్‌, తిరుపతి ఎమ్మెల్యే ఇద్దరూ  ఏ కార్యక్రమానికి వచ్చినా ఎడమొఖం, పెడమొఖం లాగా ప్రవర్తిస్తుంటారు. వీరి మధ్య ఉన్న వైరం ఎప్పుడు సమసిపోతుందోనని ఆశక్తిగా నగర ప్రజలు ఎదురుచూస్తున్నారు.