బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: గురువారం, 27 అక్టోబరు 2016 (16:57 IST)

రతన్ టాటాకు అదంటే పిచ్చి... చెప్పినా వినిపించుకోలేదు... మిస్త్రీ 'దీపావళి' బాంబు

మరొక్క రోజులో భారతదేశం దీపావళి జరుపుకోనుంది. ఈ దీపావళి పండుగలో మనం పేల్చే బాంబులు పేలుతాయో లేదో కానీ టాటా చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన మిస్త్రీ మాత్రం తన లేఖాస్త్రం ద్వారా టాటా గ్రూపులో ఉన్న లుకలుకలు, సెంటిమెంట్లు, గుదిబండలా మారిన ఉత్పత్తులు, న

మరొక్క రోజులో భారతదేశం దీపావళి జరుపుకోనుంది. ఈ దీపావళి పండుగలో మనం పేల్చే బాంబులు పేలుతాయో లేదో కానీ టాటా చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన మిస్త్రీ మాత్రం తన లేఖాస్త్రం ద్వారా టాటా గ్రూపులో ఉన్న లుకలుకలు, సెంటిమెంట్లు, గుదిబండలా మారిన ఉత్పత్తులు, నష్టాలు, యాజమాన్యం వైఖరి... ఇలా అనేక విషయాలపై తన లేఖలో తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా తనకు చైర్మన్ పదవి అప్పగిస్తూనే కోరలు పీకేసిన కుర్చీపై కూర్చోబెట్టారంటూ విమర్శించారు. ఇక అలాంటప్పుడు తనకు స్వేచ్చగా తీసుకునే నిర్ణయాలు తీసుకునే అధికారం ఎక్కడుంటుంది అంటూ వాపోయారు. టాటా గ్రూపులో ఉండే బోర్డ్ సభ్యులను పోస్టుమెన్లుగా అభివర్ణించారు. 
 
అసలు రతన్ టాటా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్లే టాటా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నదంటూ వెల్లడించారు. విదేశీ కంపెనీల కొనుగోళ్లతోపాటు టాటా నానో కంపెనీకి పెద్ద గుదిబండలా మారిందన్నారు. ఇప్పటివరకూ ఆ కారు నష్టాలను తెచ్చిందే తప్ప లాభాలను తీసుకువచ్చిన పరిస్థితే లేదన్నారు. ఐతే రతన్ టాటాకు మధ్యతరగతి కోసం చిన్నకారు అనే సెంటిమెంటుతో ఆ కారు నష్టాలు తెస్తున్నా అలాగే కొనసాగిస్తున్నారు. ఈ కారణంగా టాటా గ్రూపుకు రూ. 1000 కోట్లు నష్టం వచ్చిందని వెల్లడించారు. నానో కారు ప్రాజెక్టుతో లాభాలు వస్తే సరే లేదంటే దీన్ని మూసివేయడం మినహా మరో మార్గం లేదన్నారు. 
 
తను వద్దని చెపుతున్నా రతన్ టాటాకు విమానయాన రంగంలో అడుగుపెట్టాలన్న కుతూహలంతో ఎయిర్ ఏషియా, సింగపూర్ ఎయిర్ లైన్సుతో జాయింట్ వెంచర్లను బలవంతంగా ఒప్పించినట్లు ఆరోపించారు. ఇలా కంపెనీ నష్టపోయే నిర్ణయాలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ చివరికి తనపై వేటు వేశారంటూ లేఖలో పేర్కొన్నారు.