మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2016 (02:50 IST)

శోభన్‌బాబుతో ప్రేమ విఫలం.. జయలలిత సూసైడ్ అటెంప్ట్.. స్లీవ్‌లెస్‌ జాకెట్‌ ధరించిన తొలితార...

తమిళనాడు ముఖ్యమంత్రి పురట్చితలైవి డాక్టర్ జయలలిత... ఇటు రాజకీయ జీవితానికి, అటు సినీ జీవితానికి సంబంధించి అందరకీ తెలియని అనేకమైన ఆసక్తికరమైన అంశాలు దాగివున్నాయి. ఆమె తమిళ, కన్నడ, తెలుగు సినిమాల్లో నటిం

తమిళనాడు ముఖ్యమంత్రి పురట్చితలైవి డాక్టర్ జయలలిత... ఇటు రాజకీయ జీవితానికి, అటు సినీ జీవితానికి సంబంధించి అందరకీ తెలియని అనేకమైన ఆసక్తికరమైన అంశాలు దాగివున్నాయి. ఆమె తమిళ, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించారు. కానీ, హిందీ చిత్రం 'హిజ్జత్‌'లోనే కాకుండా చిత్ర రంగంలోకి ప్రవేశించక ముందు ఓ ఆంగ్ల లఘు చిత్రంలో నటించారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. 
 
*మాజీ భారత రాష్ట్రపతి వీవీ గిరి కుమారుడు శ్రీ శంకర్‌ గిరీ 1961లో నిర్మించి, దర్శకత్వం వహించిన 'ఎపిస్టిల్‌' అనే ఆంగ్ల లఘు చిత్రంలో ఆమె నటించారు. 
* 'వెన్నిర అదయ్‌' అనే తమిళ చిత్రంలో తొలిసారిగా లీడ్‌ రోల్‌లో 'యువ వితంతువుగా' నటించారు. ఈ చిత్రానికి యు సర్టిఫికేట్ రావడంతో చిన్న పిల్లలతో పాటు.. జయలలిత కూడా చూడలేక పోయారు. 
* తల్లి వేదవతి (సంధ్య) బలవంతంపై చిన్న వయస్సులో సినిమా రంగంలోకి వచ్చారు. 
* తమిళ సినిమా పాటలో స్లీవ్‌లెస్‌ జాకెట్‌ ధరించి, జలపాతంలో తడిసిన తొలితారగా రికార్డు నెలకొల్పారు.
* జయలలిత కర్ణాటకలో పుట్టినప్పటికీ కావేరీ జలాల కోసం తమిళనాడు పక్షాల పోరాడి విజయం సాధించారు. 
* తెలుగు అందాల నటుడు శోభన్‌బాబు(వివాహమైన తర్వాత)ను ప్రేమించగా, ఆ ప్రేమ ఫలించక ఆత్మహత్యాయత్నం చేసినట్టు ఓ పుకారు ఉంది. ఆ సమయంలోనే ఎంజీ.రామచంద్రన్‌ ఆమెకు ఎంతో నచ్చచెప్పి 1982లో రాజకీయాల్లోకి తీసుకొచ్చారట. ఇది 1981లో జరిగింది. 
* జయలలిత 85 తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. వీటిలో 80 చిత్రాలు సూపర్‌ హిట్టయ్యాయి. తెలుగులో 25 చిత్రాలు మాత్రమే హిట్టయ్యాయి. 
* ఇంగ్లీషు నవలలు ఎక్కువ చదివేవారు. ఎక్కడికి షూటింగ్‌కు వెళ్లినా చేతిలో పుస్తకం ఉండాల్సిందే. రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆమె ఇంగ్లీషు నవలలను వదల్లేదు. 
* జయలలిత 'తాయ్‌' (అమ్మ) పేరుతో తమిళ పత్రికలు వ్యాసాలు రాసేవారు. ఓ నవల కూడా రాశారట. 
* మూడేళ్ల వయస్సులో భరత నాట్యం, ఆ తర్వాత మోహినీ హట్టం, మణిపూరి, కథక్‌ నత్యాల్లో శిక్షణ పొందారు. 
* జయలలిత బాల్యంలో ఉన్న సమయంలో మైసూర్‌లోని రెండు ఇళ్లలో ఉన్నారట. అందులో ఒకటి జయ విలాస్‌ కాగా, మరొకటి లలిత విలాస్‌ అని చెపుతారు. ఆ రెండు కలపి జయలలితగా ఆమె తల్లి, తండ్రులు నామకరణం చేసినట్టు ప్రచారంలో ఉంది.