శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: శుక్రవారం, 3 ఆగస్టు 2018 (21:39 IST)

స్నేహితుల రోజు... మీ ఫ్రెండ్‌కి ఏమిస్తున్నారు?

నేటి యువతీయువకుల మధ్య స్నేహితుల రోజు (ఫ్రెండ్‌షిప్ డే)కి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆగస్టు నెల మొదటి ఆదివారం ఆనందోత్సవాల మధ్య స్నేహితుల రోజును జరుపుకుంటారు. ఈ సంస్కృతికి అమెరికా 1935లో శ్రీకారం చుట్టింది. ఇంతితై వటుడింతై అన్న చందంగా ఈ సంస్కృతి విస్తరించ

నేటి యువతీయువకుల మధ్య స్నేహితుల రోజు (ఫ్రెండ్‌షిప్ డే)కి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆగస్టు నెల మొదటి ఆదివారం ఆనందోత్సవాల మధ్య స్నేహితుల రోజును జరుపుకుంటారు. ఈ సంస్కృతికి అమెరికా 1935లో శ్రీకారం చుట్టింది. ఇంతితై వటుడింతై అన్న చందంగా ఈ సంస్కృతి విస్తరించడమే కాకుండా.. దీన్ని జరుపుకునే దేశాల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. వాటి సరసన భారత దేశం కూడా చేరింది. ప్రతి ఆగస్టు మొదటి ఆదివారం తమ స్నేహితుని ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపి, తమ ఆనందాన్ని వ్యక్త పరుచుకుంటు ఉంటారు స్నేహితులు.
 
అంతేకాకుండా.. ఈ దినోత్సవానికి గుర్తుగా తమకు తోచిన రీతిలో బహుమతులను కూడా అందజేస్తుంటారు. వీటిలో ఎక్కువగా.. పుష్పగుచ్చాలు, కార్డులు, చేతి బ్రాండ్స్ వంటివి ఉంటున్నాయి. స్నేహితుల దినోత్సవానికి సంబంధించి చరిత్రలో పెద్ద వివరాలు ఏమీ లేవు.
 
అయితే.. మానవాళి ఏర్పడినప్పటి నుంచి.. స్నేహితుల మధ్య స్నేహ సంబంధాలు బలపడుతున్నట్టు చరిత్ర ఆధారుల చెపుతున్నాయి. ముఖ్యంగా.. ఈ సంస్కృతికి నాంది పలికిన అమెరికాలో.. తమ మిత్రుల హృదయాలను అకట్టుకునేలా సందేశాలు పంపటం ఆనవాయితీగా ఉన్నట్టు చరిత్ర పుటల్లో ఉంది.
 
ప్రత్యేక రచన లేదా సూక్తిని రాసి బహుకరించడమే కాకుండా.. తమలోని ప్రత్యేక సృజనాత్మకతను వెలిబుచ్చుతూ.. తీయటి పాటలను రాసి తమ మిత్రులకు అందజేస్తారు. మానవ జీవితంలో స్నేహానికి ఉండే విలువైన పాత్రను వివరిస్తూ.. తమ స్నేహితులకు సందేశాలను ఈ స్నేహితుల రోజున పంపుకుంటుంటారు. ఇందుకోసం.. యునైటెడ్ కాంగ్రెస్.. 1935లో ఆగస్టు నెలలోని తొలి ఆదివారాన్ని జాతీయ ఫ్రెండ్‌షిప్ డేగా ప్రకటించింది.
 
అప్పటి నుంచి ఈ ఫ్రెండ్‌షిప్ డే వార్షిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇలా.. యూఎస్‌లో ఈ స్నేహితుల దినోత్సవానికి అత్యంత ప్రాముఖ్యత లభించింది. తర్వాత ఈ సంస్కృతి అన్ని దేశాలు దిగుమితి చేసుకుని.. తమ స్నేహితులకు పరస్పర అభినందలు తెలుపుకోవడం ఆరంభమైంది. ప్రస్తుతం పలు దేశాల్లో ఈ దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగాను, ఆనందడోలికల్లో మునిగి తేలుతూ జరుపుకుంటున్నారు. ఇందులో భారత దేశం కూడా ఒకటి.