శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: గురువారం, 2 ఆగస్టు 2018 (14:08 IST)

మీ ప్రాణ మిత్రుడు ఎవరు? ఎందుకో తెలుసా?

పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకూ ఎంతో కలిసి మెలిసి కాలం గడిపిన స్నేహితులు... నానాటికి పెరిగిపోతున్న డబ్బు పోటుకు దూరమైపోతున్నారు. అభిమానంగా పలుకరించుకునే సమయం కూడా లేకుండా పోతోంది. ఇది నగర, పట్టణ ప్రాంత స్నేహితుల సమస్య.

పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకూ ఎంతో కలిసి మెలిసి కాలం గడిపిన స్నేహితులు... నానాటికి పెరిగిపోతున్న డబ్బు పోటుకు దూరమైపోతున్నారు. అభిమానంగా పలుకరించుకునే సమయం కూడా లేకుండా పోతోంది. ఇది నగర, పట్టణ ప్రాంత స్నేహితుల సమస్య. 
 
ఇక పల్లెల్లో స్నేహం చిన్ననాటి స్నేహంగానే మిగిలిపోతోంది. ఎలిమెంటరీ స్థాయి వయసులో ధనవంతులు, నిరుపేదల పిల్లలు కలిసి ఆటలాడుకుంటూ పరస్పరం పరిచయస్తులుగా మారుతారు. ఆ తర్వాత వారి భావాలు, అభిప్రాయాలు జత కుదిరి ప్రాణ స్నేహితులవుతారు. అయితే నేటి కార్పొరేట్ బిజీ విద్యా బోధనలతో ఆ బంధానికి అక్కడే ఫుల్‌స్టాప్ పడిపోతోంది. దాంతో ఎవరి దారి వారిదే అవుతోంది. మొత్తానికి స్నేహితు(రాలు)డితో సంతోషంగా కొన్ని రోజులపాటు సమయాన్ని వెచ్చించే సమయం లేకుండా పోతోంది. 
 
ఇన్ని ఇబ్బందుల్లోనూ స్నేహితులు మాత్రం తమ ప్రాణమిత్రులను విడవకుండా అవకాశమున్నప్పుడల్లా...
ఫోనులో హలో ఫ్రెండ్ అంటూనో... 
సెల్ మెసేజ్‌లో ఏరా బాబాయ్ అంటూనో... 
మరింత దూరమైతో కంప్యూటర్ మెయిల్ ద్వారా డియర్ ఫ్రెండ్ అంటూనో.. 
కంప్యూటర్ సౌకర్యం లేకపోతే పోస్టుకార్డుపై ప్రియ మిత్రునికి అనే వాక్యంతోనో... 
ఖచ్చితంగా పలుకరించడాన్ని చూస్తే స్నేహబంధం ఎంత దృఢమైనదో తెలుస్తుంది. 
 
అవసరానికే స్నేహం, డబ్బు స్నేహం.. వంటి కొన్ని స్వార్థ స్నేహాలను పక్కన పెడితే, నిజమైన స్నేహం నిండు నూరేళ్లు అలా స్నేహితుల మధ్య ఒకరి నుంచి మరొకరికి ప్రవహిస్తూనే ఉంటుంది. సుఖదుఃఖాల్లో పాలుపంచుకుంటుంది. ఎప్పటికప్పుడు ఆ స్నేహభావం తెలియకుండానే వారివారి మనసులను మృదువుగా స్పృశిస్తుంటుంది. ఆ మృదుత్వంలోని తీయదనం నిజమైన మిత్రులకే తెలుసు మరి. 
 
అందుకే ఎక్కడున్నా.. ఏ దేశంలో ఉన్నా.. హల్లో నేస్తం బాగున్నావా..? అనే ఆత్మీయతా పిలుపు ప్రియ మిత్రుడు/మిత్రురాలి వద్ద నుంచి వినబడుతూనే ఉంటుంది. ఆగుస్టు 5 స్నేహితుల రోజు సందర్భంగా మనం కూడా మన స్నేహితులతో సంతోషాన్ని పంచుకుందాం... పదండి.