అమ్మా... మీరు రావచ్చు.. పురంధేశ్వరికి తలుపులు తెరిచిన జగన్.. ఎందుకు?
అధికార తెలుగుదేశం పార్టీ కన్నా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే సీనియర్ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్ లగడపాటి రాజగోపాల్ వైకాపాలోకి వెళ్ళేందుకు జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ప్ర
అధికార తెలుగుదేశం పార్టీ కన్నా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే సీనియర్ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్ లగడపాటి రాజగోపాల్ వైకాపాలోకి వెళ్ళేందుకు జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ప్రస్తుతం అదే బాటలోకి వెళ్ళిపోతున్నారు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి.
పురంధేశ్వరి. ఈ పేరు తెలియని వారుండరు. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈమె చివరకు బిజెపి పంచన చేరారు. అయితే ఆ పార్టీలో కూడా పెద్దగా గుర్తింపు లేకపోవడం.. సముచిత స్థానం లభించకపోవడంతో ఇక చేసేది లేక ఆమె పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చారట. అంటే ఈసారి జాతీయ పార్టీ కాదు.. స్థానిక పార్టీ. తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎలాగో పురంధేశ్వరి చేరరు కనుక ఇక మిగిలింది వైకాపా. అదే ప్రస్తుతం పురంధేశ్వరి చేస్తున్నారు. ఆ పార్టీలో చేరేందుకు తట్టాబుట్టా సర్దుకుంటున్నారు.
నిన్న బెంగళూరులో పురంధేశ్వరి జగన్ మోహన్ రెడ్డిని కలిశారట. గంటకుపైగా సుధీర్ఘంగా జగన్‌తో మాట్లాడారట పురంధేశ్వరి. పురంధేశ్వరి ఒక్కరే బెంగళూరుకు వెళ్ళారట. పురంధేశ్వరిని సాదరంగా ఆహ్వానించిన జగన్.. మీరు పార్టీలోకి రావాడమే ఒక అదృష్టమని చెప్పుకొచ్చారట. అంతేకాదు... అమ్మా అని కూడా పురంధేశ్వరిని సంభోధించారట జగన్. మీరు రండి.. మీకు అడ్డేముంది అంటూ పార్టీలోకి ఆహ్వానించారట జగన్. త్వరలో విజయవాడలో చేరేందుకు పురంధేశ్వరి సిద్ధమయ్యారని సమాచారం. అయితే ఆర్భాటంగా కాకుండా చాలా సింపుల్‌గా పార్టీ కండువా వేసుకోవాలని నిర్ణయానికి వచ్చారట. మరి పురంధేశ్వరి వైకాపాలో ఏ విధంగా ముందుకెళతారో వేచి చూడాల్సిందే.