ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : శనివారం, 19 నవంబరు 2016 (12:36 IST)

2019 ఎన్నికలు.. పవన్ పార్టీ Vs జూనియర్ ఎన్టీఆర్ పార్టీ.. టీడీపీ, వైకాపాది అధోగతే..!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. 2019 ఎన్నికల్లో మూడు ముక్కలాటకు రంగం సిద్ధమవుతోంది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ లైన్లో

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. 2019 ఎన్నికల్లో మూడు ముక్కలాటకు రంగం సిద్ధమవుతోంది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ లైన్లోకి రానుంది. దీంతో రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టడం ఖాయమని తేలిపోయింది. ప్రత్యేక హోదాపై ప్యాకేజీలపై అసంతృప్తితో ఉన్న పవన్ కల్యాణ్ ఇప్పటికే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించేశారు. దీంతో టీడీపీకి, వైకాపా గతి అధోగతేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
అయితే టీడీపీ ఎలా గంగలో కలిసిపోతే పోయింది కానీ.. ఎన్టీఆర్ వారసుడిని ఏపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. తెదేపా వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ వారసులైన కుమారులు రాజకీయాల్లో అంతగా రాణించలేకపోవడంతో.. జూనియర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ మూడు పార్టీలకు చెక్ పెట్టే దిశగా జూనియర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దించాలని సీనియర్లు భావిస్తున్నారట. ఇందుకోసం జూనియర్ ఎన్టీఆర్ పేరిట కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 
 
ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడితే తప్పకుండా ఆ పార్టీకే క్రేజ్ పెరుగుతుందని కొందరంటే.. అప్పుడు పవన్ పార్టీ Vs ఎన్టీఆర్ పార్టీల మధ్య రసవత్తరమైన పోరు జరుగుతుందని రాజకీయ పండితులు అంటున్నారు. అదే గనక జరిగితే టీడీపీ, వైకాపాల అడ్రస్ గల్లంతేనని వారు చెప్తున్నారు. ఎన్టీఆర్ పెట్ట‌బోయే కొత్త పార్టీలో అత‌డికి అత్యంత ఆప్తుడు, స‌న్నిహితుడు అయిన కొడాలి నాని కీల‌క పాత్ర పోషిస్తాడని తెలుస్తోంది. ఈ పార్టీలోకి వైకాపా, టీడీపీ నేతలు జంప్ కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌స్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది. మరి 2019 ఎన్నికలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాలి.