సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: గురువారం, 3 నవంబరు 2016 (12:19 IST)

'శృతి' మించిన ప్రేమాయ‌ణం... క‌మ‌ల్, గౌత‌మి... దెబ్బ తగిలితే చెప్పలేదట...

వారిద్ద‌రూ క‌లిసి ఉన్న‌ది 13 ఏళ్ళు... వారిద్ద‌రి మ‌ధ్య వ‌యోబేధం కూడా 13 ఏళ్ళే... 61 ఏళ్ళ క‌మ‌ల్ హాస‌న్, 48 ఏళ్ళ గౌత‌మిల‌ది లేటు వ‌య‌సులో ఘాటు ప్రేమ‌. ఉడుకు ర‌క్తంలో, టీనేజీలో ప్రేమ తురతుర‌లాడుతుంది. పెద్ద వ‌య‌సులో ప్రేమ నిల‌క‌డ‌గా ఉంటుందంటారు. కానీ,

వారిద్ద‌రూ క‌లిసి ఉన్న‌ది 13 ఏళ్ళు... వారిద్ద‌రి మ‌ధ్య వ‌యోబేధం కూడా 13 ఏళ్ళే... 61 ఏళ్ళ క‌మ‌ల్ హాస‌న్, 48 ఏళ్ళ గౌత‌మిల‌ది లేటు వ‌య‌సులో ఘాటు ప్రేమ‌. ఉడుకు ర‌క్తంలో, టీనేజీలో ప్రేమ తురతుర‌లాడుతుంది. పెద్ద వ‌య‌సులో ప్రేమ నిల‌క‌డ‌గా ఉంటుందంటారు. కానీ, గౌత‌మి, క‌మ‌ల్‌ల విష‌యంలో అలా జ‌ర‌గ‌లేదు. 13 ఏళ్ళ వారి స‌హ‌జీవ‌నం చివ‌రికి ఎడ‌బాటుకు, విడి బాట‌కు దారితీసింది. ఆరు దశాబ్దాల వయసు మళ్లిన కమల్ అసలు... గౌతమిని ఇపుడు ఎందుకు నిర్లక్ష్యం చేశారన్నది ప్రశ్న. పిల్ల‌ల గురించి ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని గౌత‌మి చెపుతున్నా... అస‌లు క‌లిసే ముందు పిల్ల‌ల గురించి ఆలోచించ‌ని వారు... ఇపుడు ఎందుకు ఆలోచిస్తున్నార‌నేది అభిమానుల సందేహం.
 
షూటింగ్‌లో క‌మ‌ల్ కాలికి గాయమైతే, ఈ విషయాన్ని శ్రుతిహాసన్‌, అక్షరలకు గౌతమి తెలియజేయలేద‌ట‌. దీంతో ఇద్దరు కుమార్తెలకు, గౌతమికి మధ్య మాటామాటా పెరిగి విభేదాలు ముదిరాయి. మరోపక్క శభాష్ నాయుడు చిత్రంలో కస్ట్యూమ్స్ బాగాలేదని శ్రుతి హాస‌న్ నేరుగా గౌతమికే చెప్పటం వివాదం చినికి చినికి గాలివాన అయింది. త‌న బిడ్డకే కమల్ వత్తాసు పలకటం కూడా గౌతమి బంధాన్ని తెగతెంపులు చేసింది.
 
కమల్ హాసన్ మొదటి భార్యగా డ్యాన్సర్ వాణీ గణపతిని 1978లో వివాహం చేసుకున్నారు. సరిగ్గా పదేళ్లకు ఆమెతో తెగతెంపులు చేసుకుని 1988లో బాలీవుడ్ హీరోయిన్ సారికను ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరికి 1986 లోనే శ్రుతిహాసన్ పుట్టడం గమనార్హం. 1991లో మరో కూతురు అక్షర హాసన్ జన్మించింది. అనంతరం 16 ఏళ్ల కాపురానికి పుల్‌స్టాప్ పెట్టి 2004లో విడాకులు తీసుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో నటి గౌతమితో సాన్నిహిత్యం కాస్తా, సహజీవనానికి దారితీసింది. 2005 నుంచి 2016 వరకు చెట్టాపట్టాలేసుకుని ఈడొచ్చిన పిల్లల ముందు తిరిగారు కమల్, గౌతమి. అప్పుడు పిల్ల‌ల గురించి ఆలోచించ‌ని వారు... ఇపుడు మాత్రం వారికే పెద్దపీట వేయ‌డం గ‌మ‌నార్హం.
 
గౌత‌మి తెలుగు చిత్ర రంగంలో స్టార్‌డమ్‌తో వెలుగుతున్నప్పుడే 1998లో వ్యాపారవేత్త భాటియాను వివాహం చేసుకుంది. విశాఖకు చెందిన గౌతమి త‌న పెళ్లి విష‌యాన్ని మీడియాకు, బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌కుండా కొద్దికాలం గోప్యం పాటించారు. వీరికి 1999లో సుబ్బలక్ష్మి జన్మించింది. అదే ఏడాది భర్తకు విడాకులిచ్చింది అందాల తార గౌత‌మి. త‌ర్వాత ఆమెకు క్యాన్స‌ర్ రావ‌డం, బ‌ల‌హీన క్ష‌ణాల్లో క‌మల్ ఆమెకు అండ‌గా నిల‌బ‌డ‌టం జ‌రిగింది. కానీ, క్యాన్స‌ర్‌ని జ‌యించిన గౌత‌మి, త‌న స‌హజీవిత భాగ‌స్వామిని జ‌యించ‌లేక పోయింది.
 
కమల్ హాసన్‌తో విడిపోతున్నట్లు ట్విట‌ర్ ద్వారా గౌత‌మి హాట్ న్యూస్‌ను కూల్‌గా డెలవరీ చేశారు. ఇక కమల్ మాత్రం తన నటనా కౌశల్యాన్ని ప్రదర్శించారు. రెండో భార్య పిల్లలు శ్రుతి, అక్షరలతోపాటు గౌతమి కూతురుని కలిపి ముగ్గురు పిల్లలను నా భగవంతుడిచ్చిన వరం అంటూ నోరు మెదపకుండా బ్రేకప్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. వారిద్ద‌రు విడిపోవ‌డానికి నేనెందుకు కార‌ణం అవుతా అని శ్రుతి హాస‌న్ మీడియాపై మండిప‌డుతున్నారు. కాస్ట్యూమ్స్ ద‌గ్గ‌ర వ‌చ్చిన గొడ‌వ‌తో... ఇక ‘శభాష్‌ నాయుడు’ చిత్రానికి కస్ట్యూమ్స్ డిజైనర్‌గా గౌతమిని కొనసాగిస్తారా? ల‌ేక అక్కడ కూడా విడాకులేనా అనేది వేచి చూడాలి.