గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By vasu
Last Modified: మంగళవారం, 20 జూన్ 2017 (18:27 IST)

సెల్ ఫోనూ... నీకో సలాం... ప్లీజ్ నన్నొదులు...

ఆధునిక సమాజంలోని సభ్యులమైన మనందరం, మన పక్కన ఉండే మనిషి కంటే కూడా చేతిలో ఉండే సాంకేతిక పరికరాల మీద ఆధారపడిపోతున్నామనేది ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు. కానీ ఈ సాంకేతిక పరికరాల మోజులో పడి మనిషి సమాజంలో జీవించడం మరిచి తనదైన ఊహా లోకాలలో బ్రతికేస్తున్నాడనడం

ఆధునిక సమాజంలోని సభ్యులమైన మనందరం, మన పక్కన ఉండే మనిషి కంటే కూడా చేతిలో ఉండే సాంకేతిక పరికరాల మీద ఆధారపడిపోతున్నామనేది ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు. కానీ ఈ సాంకేతిక పరికరాల మోజులో పడి మనిషి సమాజంలో జీవించడం మరిచి తనదైన ఊహా లోకాలలో బ్రతికేస్తున్నాడనడం కూడా అంతేస్థాయి నిజంగా చెప్పవచ్చు.
 
ఈ సాంకేతిక పరికరాల వ్యవహారం ఎంత ముదురుతోందంటే, సాక్షాత్తూ దేవుడే ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకో నాయనా.. అన్నప్పటికీ... మీతో సెల్ఫీ తీసుకుంటాను స్వామీ అనేంతలా పాకిపోతోందంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూ ఎన్ని జీవితాలను బలి తీసుకుంటూందో నిన్నటికి నిన్న మొబైల్‌లో మాట్లాడుతూ సిగ్నల్ సమస్యలతో బాల్కనీలోకి వచ్చి కాలు జారి 5వ అంతస్థు నుండి జారిపడిన త్రిపుర మరణం కూడా పట్టి చెపుతోంది.
 
ఇన్ని జరుగుతున్నా, సదరు మొబైల్ ఫోన్‌లను మాత్రం చివరికి గుళ్లల్లో దర్శనాలను కూడా ప్రత్యక్ష ప్రసారాలు చేసేస్తూ అదే యావలో బతికేస్తూ వుండటం ఎటు తీసుకెళుతోందో తెలియడంలేదు. సెల్ ఫోనూ... నీకో సలాం...