శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (13:35 IST)

కేసీఆర్ జీవిత చరిత్రను చదువుతున్న పవన్ కళ్యాణ్... అందుకే...

తెలంగాణ సాధనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పుడు వేసిన ఎత్తులు, ఉద్యమ బాట గురించి తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన తెలంగాణ ప్రాంతంలోని అన్ని కుల సంఘాలను, చేతి వృత్తుల వారిని... ఇలా ఎవ్వరినీ వదిలిపెట్టకుండా కలుపుకుని పోయి తెలంగాణను సాధ

తెలంగాణ సాధనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పుడు వేసిన ఎత్తులు, ఉద్యమ బాట గురించి తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన తెలంగాణ ప్రాంతంలోని అన్ని కుల సంఘాలను, చేతి వృత్తుల వారిని... ఇలా ఎవ్వరినీ వదిలిపెట్టకుండా కలుపుకుని పోయి తెలంగాణను సాధించారు. ఐతే ఈ సాధనలో ఆయనకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. వాటన్నిటినీ దాటుకుని ముందుకు సాగి విజయం సాధించారు. 
 
ఇంతకీ కేసీఆర్ సంగతి ఇప్పుడెందుకయ్యా అంటే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానం చూస్తే కేసీఆర్ గుర్తుకువస్తున్నారంటున్నారు. ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావడానికి సై అని నిన్నటి సభలో ప్రకటించారు కూడా. ఈ నేపధ్యంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాంటి వ్యూహాలను రచించారో అదే క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా పయనిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
అంతేకాదు... అసలు కేసీఆర్ రాజకీయ అరంగేట్రం గురించి మొత్తం పవన్ కళ్యాణ్ కూలంకషంగా తెలుసుకుంటున్నట్లు సమాచారం. కేసీఆర్ సక్సెస్ యాత్ర ఎలా జరిగిందో అలాగే తను కూడా పయనించాలని అనుకుంటున్నారట పవన్. సామాజిక వర్గాలన్నీ ఒక్క తాటిపైకి తేగలిగితే పవన్ అనుకున్నది సాధించడం చాలా ఈజీయే కదూ...!!