శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (20:30 IST)

ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న శశికళ - సీఎం పీఠం పన్నీరుకు రాకుండా మోకాలడ్డు..!

తనకు దొరకంది.. వేరొకరిది దొరకకూడదన్న చందంగా శశికళ వ్యవహరిస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల భావన. నాలుగేళ్ళు జైలుశిక్ష, 10 యేళ్ళు పాటు రాజకీయాల్లో పోటీ అర్హత కోల్పోవడం, 10 కోట్ల రూపాయల జరిమానా.

తనకు దొరకంది.. వేరొకరిది దొరకకూడదన్న చందంగా శశికళ వ్యవహరిస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల భావన. నాలుగేళ్ళు జైలుశిక్ష, 10 యేళ్ళు పాటు రాజకీయాల్లో పోటీ అర్హత కోల్పోవడం, 10 కోట్ల రూపాయల జరిమానా. అసలు శశికళ ఊహించని పరిణామం ఇది. ఆమె సన్నిహితులు కూడా శశికళ నిర్ధోషిగానే వస్తుందని భావించారు. కానీ చివరకు జరిగింది మాత్రం అందుకు విరుద్ధం. దీంతో శశికళ తనకు దగ్గని సిఎం పదవి వేరొకరికి దక్కకూడదన్న ఉద్దేశంతో ప్రస్తుతం పావులు కదుపుతున్నారు. అదే పళణిస్వామి అనే ఎమ్మెల్యేని తెరపైకి తీసుకురావడం.
 
ప్రస్తుతం పళణిస్వామి అందరి దృష్టిలో హీరోగా మారారు. గోల్డెన్ బే రిసార్ట్స్‌లో 124 మంది ఎమ్మెల్యేలుంటే అందులో పళణిస్వామినే శశికళ ఎంచుకోవడం వెనుక పెద్ద కథే ఉంది. పార్టీ సీనియర్ నేతతో పాటు జయలలితకు ఈయన అత్యంత సన్నిహితుడు. అందుకే శశికళ ఈయన్ను ఎంచుకుంది. అంతేకాదు ప్రస్తుతం మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే. ఈయనపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని అంతో ఇంతో నడిపే సత్తా ఈయనకు మాత్రమే ఉందన్నది శశికళ భావన.
 
కానీ పళణిస్వామిపై గవర్నర్‌కే ఏకంగా ఫిర్యాదు చేశారు పన్నీరు సెల్వం వర్గీయులు. అది కూడా ఎంపీ మైత్రేయన్ నేరుగా గవర్నర్‌తో భేటీ తర్వాత ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. అప్రజాస్వామికంగా ఎమ్మెల్యేలు శాసనాసభాపక్ష నేతను ఎన్నుకున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుకు ముందే పళణిస్వామి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వాలంటూ కోరారు.
 
ఇప్పటివరకు పన్నీరు సెల్వం, శశికళకు మధ్యే పోటీ కనిపిస్తే.. ఇప్పుడు కథంతా పన్నీరు సెల్వం, పళణిస్వామికి మధ్యే కనిపిస్తుంది. పళణిస్వామిపై ఉన్న ఆరోపణలనే సాకుగా చూపించి పన్నీరు సెల్వం ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఎమ్మెల్యేగా పళణిస్వామి చేసిన అరాచకాలు, మంత్రిగా దోచుకున్న ఆస్తుల చిట్టాలను గవర్నర్ ముందు మైత్రేయన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో గవర్నర్ ఆ కథంతా విని సరేనని మైత్రేయన్‌ని అక్కడి నుంచి పంపేశారు. అందరి మాటలు వింటున్న గవర్నర్‌దే ప్రస్తుతం ఫైనల్ డెసిషన్. 
 
శశికళ మాత్రం 124 మంది ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రిసార్టులో బుజ్జగించి తాను ప్రతిపాదించిన పళణిస్వామికి అవకాశం ఇవ్వాలని కోరారట. అయితే ముందు చాలామంది ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు గానీ, ఆ తరువాత సరేనని శశికళకు హామీ ఇచ్చారు. ఇదంతా బాగానే ఉన్నా వీరందరూ చివరల్లో అంటే శాసనసభా సమావేశాల్లో బల నిరూపణ సమయంలో ఓట్లేస్తారా లేదా అన్నదే అనుమానం.
 
పన్నీరు సెల్వం కూడా తన వాగ్దాటిని మరింత పెంచాడు. అదే మళ్ళీ జయలలిత జపం. జయలలిత తమిళనాడు పాలన తిరిగి రావాలంటే ఖచ్చితంగా తనకు అవకాశమివ్వాలంటూ శశికళ రిసార్ట్ర్‌లోని వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అంతేకాదు మంచి పాలన వస్తుంది.. ధర్మమే గెలుస్తుందని ముందే చెప్పాను కదా అదే వచ్చిందని కూడా చెబుతున్నారు. కానీ జరుగుతుంది చూస్తుంటే మాత్రం పళణిస్వామి, పన్నీరుసెల్వంలకు మధ్య తీవ్ర స్థాయిలో పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. చివరి నిర్ణయం గవర్నర్ దే...