సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By vasu
Last Updated : బుధవారం, 19 జులై 2017 (11:42 IST)

తల్లిదండ్రులూ... పిల్లలను మరో పూర్ణిమసాయి కానివ్వరాదు...

పూర్ణిమ సాయి... టీవీ9 పుణ్యమా అని తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకు పెద్దగా పరిచయమక్కర్లేదు. కానీ ప్రస్తుతం ఈ పేరును పేరెంటింగ్ లోపాలకు నిదర్శనంగా చెప్పడం కొసమెరుపు.

పూర్ణిమ సాయి... టీవీ9 పుణ్యమా అని తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకు పెద్దగా పరిచయమక్కర్లేదు. కానీ ప్రస్తుతం ఈ పేరును పేరెంటింగ్ లోపాలకు నిదర్శనంగా చెప్పడం కొసమెరుపు.
 
పిల్లలను బాగా చదవమని పెద్దవాళ్లు ఒత్తిడి తీసుకురావడం ప్రతి ఇంట్లోనూ.. ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్యే అయినప్పటికీ... దానికి పిల్లలు చేసే ఇటువంటి పనులను పరిష్కారాలుగా ఎంత మేరకు ఒప్పుకోవాలి అనేది అర్థం కాని సమస్య. 
 
ఏ తరంలోనైనా పెద్దవాళ్లలో ఏదో సాధించేసామనే తృప్తికన్నా ఇంకేదో సాధించలేకపోయామే అనే బాధే ఎక్కువగా కనబడుతుంది. దీనికి ఎవ్వరూ మినహాయింపు కారనేది నిర్వివాదాంశం. దానిని పిల్లలపై రుద్ది తద్వారా తాము పొందలేని సుఖ సంతోషాలను వారు పొందితే తృప్తి పడాలనుకొని అందుకోసం నానా కష్టాలు పడి అధిక మొత్తాలను ఫీజుల రూపంలో చెల్లించడం తండ్రుల తప్పా...
 
లేదా పిల్లలతో మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకునే సమయం కూడా కేటాయించకుండా పెద్ద స్కూల్‌లలో ఫీజులు కట్టేశాం... అవసరమైతే ట్యూషన్‌లు కూడా ఏర్పాటు చేస్తాం... మార్కులు మాత్రం తగ్గేదానికి లేదని తెగేసి చెప్పి తమ మానాన తమ తమ వంటపనులు, అవి పూర్తయ్యాక టీవీ సీరియళ్లకు అంకితమైపోవడం అమ్మల తప్పా. 
 
ఏది ఏమైనప్పటికీ.. ప్రస్తుత తరానికి ముందు తరానికి తేడాగా సాంకేతికతను చెప్పుకోవచ్చనేది జగమెరిగిన సత్యమే. అప్పటి అమ్మా నాన్నలు కనీసం వారానికోసారైనా పిల్లలతో గడిపే అవకాశముంటే ఇప్పటి అమ్మానాన్నలకు అది కూడా ఏ మొబైల్ చాట్‌కో... టీవీ సీరియల్‌కో సరిపోతోందనేది అందరికీ తెలిసినదే.
 
ఇకమీదటైనా పెద్దల తమ ఆశయాలను పిల్లలకు వివరించి మెల్లగా సర్దిచెప్పగలిగితే... మరో నాగరాజు, విజయదేవిలు తమ పూర్ణిమసాయిల కోసం ఇంతగా బాధపడాల్సిన అవసరముండదని చెప్పవచ్చు.