శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : ఆదివారం, 2 జులై 2017 (13:14 IST)

జే.శేఖర్ రెడ్డి డెయిరీలో తమిళ సిఎం పేరు...?

జే.శేఖర్ రెడ్డి. ఈయన గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. టిటిడి వంటి ధార్మిక సంస్థల్లో పాలకమండలి సభ్యులుగా ఉన్న శేఖర్ రెడ్డి చివరకు ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులతో కటకటాల పాలయ్యారు.

జే.శేఖర్ రెడ్డి. ఈయన గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. టిటిడి వంటి ధార్మిక సంస్థల్లో పాలకమండలి సభ్యులుగా ఉన్న శేఖర్ రెడ్డి చివరకు ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులతో కటకటాల పాలయ్యారు. కోట్లాదిరూపాయల అక్రమాస్తులు సంపాదించి తమిళనాడు ప్రభుత్వాన్నే శాసించే స్థాయిలో ఉన్న శేఖర్ రెడ్డి ఆ తర్వాత ఊచలు లెక్కించాడు. శేఖర్ రెడ్డి జైలుకు వెళ్ళినా ఆయన వెనుక ఉన్న పాత్ర దారుల కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాం.. అక్రమార్కులను ఎవరైనా వదిలిపెట్టేది లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రకటనలతో డబ్బున్న ప్రముఖుల ఇళ్ళపై ఐటీ, ఏసీబీ దాడులు ప్రారంభమయ్యాయి.
 
ఆ దాడులు ప్రారంభమైన వెంటనే మొదటగా శేఖర్ రెడ్డి ఆ ఉచ్చులో చిగులుకున్నారు. అక్రమాస్తులను లోడితే ఒక్కసారిగా కోట్ల రూపాయల డబ్బులు బయటపడ్డాయి. శేఖర్ రెడ్డికి సహకరించిన తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖామంత్రి భాస్కరన్, మరో మంత్రి ఇద్దరూ కూడా నేరస్తులుగా గుర్తించారు. ఆ తర్వాత శేఖర్ రెడ్డి బంధువులను కూడా అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే శేఖర్ రెడ్డి డైరీలో ముగ్గురి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం ఉండటం ఇప్పుడు తీవ్ర చర్చ నీయాంశంగా మారుతోంది. 
 
ఇద్దరి పేర్లలో ఒకటి భాస్కరన్, మరొకటి ప్రభుత్వ ఉన్నతాధికారి పేరు మరో పేరు సీఎం అని స్పష్టంగా పోలీసులు గుర్తించారు. అయితే ఆ పేరును మాత్రం బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే సీఎంగా పళనిస్వామి ఉండడంతో ఆయన పేరు బయటకు వస్తే ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో గోప్యంగా ఉంచుతున్నారట. ప్రస్తుతం శేఖర్ రెడ్డి వ్యవహారంలో పళనిస్వామి పేరు ఉండడంతో అన్నాడిఎంకేలో కలవరం పట్టుకుంది. ఇప్పటికే ఏ క్షణంలోనైనా ప్రభుత్వం పడిపోతుందనుకుంటున్న తరుణంలో కొత్తగా ఈ చిక్కు వచ్చి పడటం ఆ పార్టీ నేతల్లో కలవరం పట్టుకుంది.