సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (15:57 IST)

నేడు మహానేత వైఎస్ఆర్ ప్రజలకు దూరమైన రోజు... ఆ రోజు ఏం జరిగిందంటే...

ప్రజానేత, ప్రజల మనిషి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి నేడు. సుదీర్ఘ ప్రజా జీవనయానంలో ఆదర్శ ప్రాయంగా రాజకీయాలను శ్వాసించి, శాసించిన వ్యక్తిగా రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న

ప్రజానేత, ప్రజల మనిషి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి నేడు. సుదీర్ఘ ప్రజా జీవనయానంలో ఆదర్శ ప్రాయంగా రాజకీయాలను శ్వాసించి, శాసించిన వ్యక్తిగా రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మూడు దశాబ్దాలకు పైబడిన ప్రజాప్రాతినిథ్య ప్రస్థానంలో ఒడుదొడుకులెదుర్కొని, పేదల కష్టాలను అతి సమీపం నుంచి చూసి చలించిన రాజకీయ నేత. పార్టీనే కాదు.. ప్రజలను కూడా కష్టాల కడలి నుంచి  తీరం చేర్చి ధీరత్వం మహానేత. ఆయనే! అశేష ప్రజానీకం ‘వైఎస్సార్’ అని ముద్దుగా పిలుచుకున్న.. ఇప్పటికీ, ఎప్పటికీ తలచుకునే డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి. ఆయన సెప్టెంబర్ 2వ తేదీన శ్రీశైలం నల్లమల అడవుల్లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. 
 
ఆ ప్రమాదానికి ముందు అసలు ఆ రోజు ఏం జరిగిందో ఓసారి పరిశీలిస్తే... బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. చిత్తూరు జిల్లాలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడు వచ్చారు. విమానం బయల్దేరడానికి ఇంకా టైమ్ ఉంది. ఈ కాస్త సమయంలో ఇక్కడే కొన్ని ఫైల్స్ క్లియర్ చేయొచ్చని అనుకున్నారు. ఏవో ఫైల్స్ తెస్తామని అధికారులంటే, '...కాదు, అవి ఎప్పుడైనా చేయొచ్చు, తొందరేం లేదు. ప్రాణాంతక జబ్బులతో నిరుపేదలు క్షణాలు లెక్కపెడుతూ నిరీక్షిస్తూ ఉంటారు. సీఎమ్మారెఫ్ ఫైల్స్ తీసుకురండి' అని పురమాయించారు. అలా తాను చనిపోయే ముందు కూడా ప్రజల కోసం పరితపించిన నేత వైఎస్ఆర్. 
 
సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం గం.9.35 నిమిషాలకు హెలికాప్టరుతో సంబంధాలు తెగిపోయాయి. సీఎం ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్ళు లభించాయి. వైఎస్‌తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తమ అభిమాన నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్ర మంతా దాదాపు 67 మంది మరణించారు. వీరిలో చాలా మంది గుండె ఆగి మరణించగా కొద్ది మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రమాదస్థలమైన రుద్రకొండ కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు - వెలుగోడుకు సమీపంలోని నల్లమల అడవుల్లో ఉంది. హెలికాప్టర్‌ కూలిన ప్రాంతం కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో ఉంది.