ఆరోగ్యం కోసం ఆరు ఫెంగ్‌షుయ్ చిట్కాలు!
ఆరోగ్యం కోసం ఫెంగ్‌షుయ్ కొన్ని చిట్కాలు చెబుతోంది. అవేంటో చూద్దామా.. ఫెంగ్‌షుయ్‌ను ఆచరిస్తే శుభఫలితాలు చేకూరుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఫెంగ్‌షుయ్ చిట్కాలు పాటిస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంకా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆరు చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
అవేంటంటే?
1. మీ బూట్లను ఇంట్లోకి ప్రవేశించే ముందే తీసేయాలి. పని ఒత్తిడి, ట్రాఫిక్ వంటి ఇతరత్రా అంశాలను ఇంటి బయటే మరిచిపోవాలి.
2. మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోని గదులు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పడకగదిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. బాత్‌రూమ్‌లను మూతపెట్టేయాలి. ప్రతిరోజూ ఉదయం ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్రలేవాలి.
3. మీ ఇంట్లో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. కిటికీలు, తలుపులు తెరిచి వుంచాలి ఇంట్లోని గాలి బయటికి, లోపలి గాలి బయటికి వెళ్లేలా చూసుకోవాలి. నిద్రకు ఉపక్రమించేందుకు ముందు బ్రైట్ లైట్స్ వాడకూడదు.
4. పడకగదిని శబ్ధాలకు దూరంగా ఏర్పాటు చేసుకోండి. రోడ్డు పక్కన, వాహనాల రాకపోకలు దగ్గరగా పడకగదిని ఏర్పాటు చేసుకోకండి.
5. ఇంటికి వేసే రంగులు ఫెంగ్ షుయ్ ప్రకారం ఎంచుకోండి. బ్లూ, లావెండర్, గ్రీన్, పీచ్ వంటి స్మూత్ కలర్స్ ఎంచుకోవడం మంచిది.
6. ప్రశాంత సంగీతాన్ని ఇంట్లో ఏర్పరుచుకోవాలి. సహజసిద్ధమైన సంగీతాన్ని, సీనరీలను వాడండి. ఇవన్నీ పాటిస్తే.. మీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండబోదని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు.