Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nag Panchami 2022: నేడు నాగ పంచమి, ఏం చేయాలి?

Written By సిహెచ్
Updated: మంగళవారం, 2 ఆగస్టు 2022 (09:12 IST)
శ్రావణ మాసంలో వచ్చే 5వ రోజున “ నాగ పంచమి“గా కొంతమంది “గరుడ పంచమి”గా పిలుస్తారు. ఈరోజు మంగళవారం నాగపంచమి. భారతీయ సంస్కృతిలో “నాగ పూజ“కి ఒక గొప్ప విశిష్టత మరియు సంప్రదాయముగా ఆచరణలో ఉంది. నాగ పంచమి ప్రాముఖ్యతని సాక్షాత్ పరమ శివుడే స్కంద పురాణములో వివరించాడు.

 
శ్రావణ శుద్ధ పంచమి నాడు చేసే నాగ పంచమి అత్యంత విశిష్టతను సంతరించుకుంది. అందుకు కారణము ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు ఆదిశేషుడు “తాము ఉద్బవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని'' వరం కోరుకున్నాడు. ఆదిశేషుని కోరికని మన్నించి మహా విష్ణువు ఈ నాగుల పంచమి రోజు సర్ప పూజలు అందరూ చేస్తారని వరాన్ని ఇస్తాడు.

 
నాగ పంచమి రోజు నాగులని పూజించి, గోధుమతో చేసిన పాయశాన్ని నైవేద్యముగా పెడతారు. నాగ పంచమి రోజు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనము చేస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతలను పూజించినవారికి "విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః, న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్ "ఈ మంత్రాన్ని చదువుతూ పుట్టలో పాలు పొయ్యాలి. నాగ పంచమి రోజున పూజ చేసిన వారికి విష భాధలు ఉండవు.

 
సర్ప స్తోత్రాన్ని ప్రతిరోజు మరియు నాగ పంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు లేక రోగాలు రావు. వంశము అభివృద్ధి అవుతుంది. సంతానోత్పత్తి కలుగుతుంది. కార్యసిద్ధి జరుగుతుంది. అన్ని కార్యములు సవ్యంగా నెరవేరతాయి. కాలసర్ప దోషాలు, నాగ దోషాలు ఉన్నా తొలగిపోతాయి.

అన్నీ చూడండి

ఆగష్టు 4, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

కుక్కను నిలబెట్టిన గెలుస్తామన్న బీజేపీ - చిత్తుచిత్తుగా ఓడించిన ఓటర్లు

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారనీ అత్త, భర్తపై విష ప్రయోగం..

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ, రాజీనామా బాటలో 10 మంది ఎమ్మెల్యేలు?!!

భాజపాకి షాకిచ్చిన PK, 3 దశాబ్దాల కోటను బద్ధలు కొట్టిన ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

04-08-2026 మంగళవారం ఫలితాలు.. మీ కష్టం వృధాకాదు.. శుభవార్త వింటారు..

03-08-2026 సోమవారం ఫలితాలు - అప్రమత్తంగా ఉండాలి.. భేషజాలకు పోవద్దు...

02-08-2026 ఫలితాలు - మీ శ్రీమతి సహాయం ఉత్సాహాన్నిస్తుంది..

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?

02-08-2026 నుంచి 08-08-2026 వరకు ఫలితాలు, ఈ వారం ఎలా వుండబోతోంది?

తర్వాతి కథనం
Show comments