ఆదివారం, 8 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ivr
Last Updated : గురువారం, 12 మార్చి 2015 (12:48 IST)

ప్రి-రిజిష్టర్డ్ కారు కొనబోతున్నారా... కాస్త ఆగి చూడండి...

ఎడ్వటోరియల్

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ఐతే కొత్త కారు కొంటున్నా డబ్బు కూడా ఆదా చేయాలనుకుంటారు. ఐతే ప్రి-రిజిష్టర్డ్ కారు లేదంటే ఎక్స్-డెమో కారు కొన్నట్లయితే వేల రూపాయలను కొంతమేర ఆదా చేసుకోవచ్చు. మూడో పద్ధతి కూడా ఉంది. కారు డీలర్ నుంచి ప్రి-రిజిష్టర్డ్ కారును కొనడం ద్వారా కొత్త కారు లేదంటే ఆల్రెడీ వాడిన కారును సొంతం చేసుకునే అవకాశం ఉంది. 

 
అసలు ప్రి-రిజిష్టర్డ్ కారు అంటే ఏమిటి?
 
ప్రి-రిజిష్టర్డ్ కారు అంటే, డీలర్ పేరు మీద రిజిష్టర్ అయి ఉన్న కారు. సాంకేతికంగా చూసినప్పుడు ఈ కారుకు డీలర్ మొదటి యజమానిగా ఉంటాడు. కారు నెంబరు ప్లేట్ కూడా ఉంటుంది. తయారీదారులు నిర్దేశించిన లక్ష్యాలు కారణంగా డీలర్ తమ అమ్మకాలను పెంచుకునేందుకు ఇలా చేస్తుంటారు. విషయం ఏంటంటే, కేవలం కారు బయటకు వచ్చి కొన్ని వారాలే అయినా దాన్ని సెకండ్ హ్యాండ్ అంటుంటారు. ఐతే కొత్త కారు కొన్నప్పుడు ఆ కారు కోసం కొన్ని వారాలు లేదా నెలలు వేచి చూడాల్సి ఉంటుంది. అదే ప్రి-రిజిష్టర్డ్ కారు అయితే వెనువెంటనే దాన్ని ఇంటికి వేసుకుని వెళ్లిపోవచ్చు. డీలర్లు తమ వద్ద ఉన్న స్టాకును తగ్గించుకునేందుకు డిస్కౌంట్లు, ఇంకా ఇతర ఆకర్షణీయమైన కానుకలు ప్రకటించి ఈ ప్రి-రిజిష్టర్డ్ కార్లను అమ్ముతుంటారు.
 
అలాంటి కారు కొనేటప్పుడు ఈ విషయాలను మనసులో ఉంచుకోవాలి 
కారు కొనేందుకు డీలర్ షిప్ వద్దకు వెళ్లేటపుడు ఖచ్చితంగా కారు గురించి మీకు కావాల్సినవి ఏమిటో రాసి ఉంచుకోండి. డిస్కౌంట్ అడిగే ముందు ఇంటి వద్ద రేటు గురించి బాగా హోంవర్క్ చేయండి. అంతేకాదు, డీలర్ ప్రకటించిన ఆఫర్ తాలూకు ప్రకటనను ధృవీకరించేందుకు గాను సదరు ప్రకటనను కత్తిరించి మీ వద్ద ఉంచుకోండి. ముఖ్యంగా వారెంటీకి సంబంధించి. అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ షోరూమ్ నుంచి వెళ్లవద్దు. అంతేకాదు, కారు వారెంటీకి సంబంధించి బదలీ ధృవీకరణ పత్రాన్ని రాయించుకుని తీసుకోవడం మరిచిపోవద్దు.
 
అనుకూలాంశాలు: 
- కొత్త కారు కొనుగోలు చేయలేకపోయినా కొత్త కారు కొన్న ఫీలింగ్ ఇస్తుంది.
- కారుకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా వాటన్నిటినీ డీలర్ పరిష్కరించి కండిషన్లో ఉంచుతాడు.  
- కారు కోసం వేచి చూడాల్సిన పనిలేదు, వెంటనే కారు మీకు లభిస్తుంది.
- ప్రి-రిజిష్టర్డ్ కారుపై గొప్ప డిస్కౌంట్లు లభిస్తాయి.
- ధరను తగ్గించి అడిగేందుకు అవకాశం
- అదనపు సౌకర్యాల కోసం అడిగే అవకాశం - ఒకవేళ వాటి గురించి అడుగకపోతే అవి మీకు లభించవు.
 
ప్రతికూలాంశాలు: 
- రిజిస్ట్రేషన్ పత్రంలో మీ పేరు తొలిపేరుగా ఉండదు. దాంతో రీ-సేల్ విలువ బాగా తగ్గిపోతుంది. 
- మోడల్ ఎంపిక విషయంలో మీరు నియంత్రణలో ఉంచబడుతారు. విషయం ఏమిటంటే, ప్రదర్శనలో ఉంచిన కారు మీకు ఉత్తమమైనదిగా కనబడుతుంది.
- అలా ప్రదర్శనగా ఉంచిన కారు కూడా కొన్ని వందల లేదా వేల కిలోమీటర్లు చక్కెర్లు కొట్టి ఉంటుంది కనుక 'కొత్తకారు' అనే ఫీల్ ఉండదు.
- ప్రి-రిజిష్టర్డ్ కారు అంటేనే 'వాడుకున్న' కారు
- మెరుగులు దిద్దడం సాధ్యం కాదు - మీరు ఏది చూశారో అదే మీకు లభిస్తుంది.
- కారు ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ బాగా తనిఖీ చేయాలి, ప్రి-రిజిష్టర్డ్ కార్లు కూడా దెబ్బతిని ఉండవచ్చు.
- రిజిస్ట్రేషన్ తేదీని బట్టి తదుపరి మాన్యుఫాక్చరింగ్ వారెంటీ, రోడ్ టాక్స్, బ్రేక్‌డౌన్ కవర్ వంటివి తగ్గిపోతాయి.
యూజ్డ్ కార్ల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.