సంబంధిత వార్తలు
- ప్రశాంతంగా నిద్రపోనిచ్చేవాడు కాదు.. ఎక్కడపడితే అక్కడ తాకేవాడు.. మోనాలిసా
- భర్తను స్నేహితుడి సాయంతో చంపేసిన భార్య.. నిద్రలో వుండగానే?
- నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు
- గుండెపోటుతో మరో యువకుడు కన్నుమూత, తల్లి ఒడిలో తలపెట్టుకుని శాశ్వత నిద్రలోకి...
- కన్నబిడ్డకు నిద్రమాత్రలిచ్చి.. ప్రియుడితో అత్యాచారం చేయించింది..
రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
నిద్రకు ఉపక్రమించే ముందు కాఫీ, టీ, చాక్లెట్ల వంటివి తింటే సరైన నిద్ర లేకుండా అవుతుంది.
మద్యం సేవిస్తే మత్తుగా నిద్రపడుతుందని అంటారు కానీ అది నిద్రాభంగం కలిగిస్తుంది.
చక్కెర స్థాయిలు అత్యధికంగా వున్న స్వీట్స్ కూడా మోతాదుకి మించి తింటే రాత్రి సరిగా నిద్రపట్టదు.
కార్బొనేటెడ్ పానీయాలు తాగడం వల్ల కడుపులో గడబిడగా వుండి నిద్రలేకుండా చేస్తాయి.
రాత్రి నిద్రపోయే ముందు కడుపు నిండుగా భోజనం చేసినా నిద్ర సరిగా పట్టదు. అందువల్ల కాస్త ఖాళీ వుంచేట్లు చూడాలి.
స్పైసీ ఫుడ్ రాత్రివేళ తీసుకుంటే దానివల్ల గుండెల్లో మంట, జీర్ణ సమస్యలు తలెత్తి నిద్రాభంగం అవుతుంది.
అధిక కొవ్వులతో కూడిన ఆహారమైన ఫ్రైడ్ ఫుడ్, మాంసాహారం రాత్రిపూట తినకుండా వుండటం మంచిది.
పుల్లపుల్లగా వుండే పండ్లను కూడా రాత్రి నిద్రకు ముందు తింటే వాటి వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట తలెత్తుతుంది.
అధికంగా ఉప్పుతో కూడిన ఆహార పదార్థాలకు రాత్రిపూట దూరంగా వుండటం మంచిది.
