జీఎస్టీ ఈరోజు నుంచి అమల్లోకి వచ్చేసింది. దీనితో దీని ప్రభావం ఏ వస్తువులపై వుంటుందని సాధారణ ప్రజానీకం ఉత్సుకత నెలకొంది. ఈ నేపధ్యంలో ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి... ఏవి తగ్గుతాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. జీఎస్టీ కౌన్సిల్ మొత్తం 1211 వస్తువులు, సేవలకు సంబంధించిన పన్నురేటును ఖరారు చేసి పొందుపరిచింది. పన్ను రేట్లు 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా నిర్ణయించారు. ధరలు పెరిగేవి, తగ్గేవి ఏమిటో ఒకసారి చూద్దాం.
ఆహార పదార్థాలు (ధరలు పెరిగేవి)
* పన్నీర్
* కార్న్ ఫ్లేక్స్
* కాఫీ
* మసాలా పొడి
* చాక్ లెట్లు
* నెయ్యి
* బిస్కట్లు కొన్ని రకాలు
* చూయింగ్ గమ్
* ఐస్ క్రీమ్
* టీ కొన్ని రకాలు
ఎలక్ట్రానిక్స్ (ధరలు పెరిగేవి)
* ఎయిర్ కండిషనర్లు
* ఫ్రిడ్జ్ లు
* వాషింగ్ మెషీన్లు
* టెలివిజన్‌లు
* స్మార్ట్ ఫోన్లు
* ల్యాప్‌టాప్‌లు
* డెస్క్‌టాప్‌లు
ఇతరాలు (ధరలు పెరిగేవి)
* సుగంధ ద్రవ్యాలు
* ఆయుర్వేదిక్ - ఇతర ప్రత్యామ్నాయ ఔషధాలు
* బంగారం
* రూ.7500 కంటే ఎక్కువ రూమ్ టారిఫ్ కలిగిన హోటళ్లు
* ఫైన్–డైనింగ్ రెస్టారెంట్లు
* ఫైవ్ స్టార్ హోటళ్ల లోపల ఉండే రెస్టారెంట్లు
* రూ.100 కంటే ఎక్కువ ధర కలిగిన సినిమా టికెట్లు
* కన్సర్ట్స్
* ఐపీఎల్ మ్యాచ్‌లు
* రూ.1000 కంటే ఎక్కువ ధర కలిగిన దుస్తులు
* షాంపులు
* పెర్‌ఫ్యూమ్‌లు
* ఏసీ - ఫస్ట్ క్లాస్ రైలు టికెట్లు
* బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు
* కొరియర్ సర్వీసులు
* మొబైల్ ఫోన్ చార్జీలు
* బీమా ప్రీమియంలు
* బ్యాంక్ చార్జీలు
* బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు
* క్రెడిట్ కార్డు బిల్లులు
* 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కలిగిన ద్విచక్ర వాహనాలు
* చిన్న - మధ్యతరహా కార్లు
* ఎస్‌యూవీలు
* చేపల వేట వలలు
* యోగా మ్యాట్‌లు, ఫిట్‌నెస్ పరికరాలు
* ఎరేటెడ్ పానీయాలు
* సిగరెట్లు
* పొగాకు
* ఆల్కహాలిక్ డ్రింక్ లు
* విలాస వస్తువులు
ఆహార పదార్థాలు (ధరలు తగ్గేవి)
* పాల పొడి
* పెరుగు
* మజ్జిగ
* అన్‌బ్రాండెడ్ తేనె
* వెన్న
* జున్ను
* మసాలా దినుసులు
* టీ కొన్ని రకాలు
* గోధుమలు
* బియ్యం
* పిండి
* బిస్కట్లు కొన్ని రకాలు
* వేరుశెనగ నూనె
* పామ్ ఆయిల్
* సన్ ఫ్లవర్ ఆయిల్
* కొబ్బరి నూనె
* ఆవాల నూనె
* చక్కెర
* బెల్లం
* చక్కెర మిఠాయి
* పాస్తా
* నూడుల్స్
* పళ్లు - కూరగాయలు
* పచ్చళ్లు
* మురబ్బా
* చట్నీ
* స్వీట్లు
* ఇన్‌స్టంట్ ఫుడ్
* మినరల్ వాటర్
* ఐస్
* బేకింగ్ పౌడర్
* ఎండు ద్రాక్ష
* జీడిపప్పు
నిత్యావసరాలు (ధరలు తగ్గేవి)
* సబ్బులు
* కొబ్బరి నూనె
* డిటర్జెంట్ పౌడర్
* అగరబత్తులు
* టిష్యూ పేపర్లు
* నేప్‌కిన్లు
* అగ్గిపెట్టెలు
* కొవ్వొత్తులు
* బొగ్గు
* కిరోసిన్
* గృహ అవసరాలకు వినియోగించే ఎల్ పీజీ
* స్పూన్లు
* ఫోర్క్‌లు
* టూత్ పేస్ట్ లు
* కాటుక
* ఎల్పీజీ స్టౌవ్
స్టేషనరీ (ధరలు తగ్గేవి)
* నోటు పుస్తకాలు
* పెన్నులు
* అన్ని రకాల కాగితాలు
* గ్రాఫ్ పేపర్
* స్కూల్ బ్యాగ్
* ఎక్సర్‌సైజ్ బుక్
* పిక్చర్ - డ్రాయింగ్ - కలరింగ్ బుక్స్
* తోలు కాగితం
* కార్బన్ పేపర్
* ప్రింటర్లు
హెల్త్ కేర్ (ధరలు తగ్గేవి)
* ఇన్సులిన్
* వైద్య కోసం ఉపయోగించే ఎక్స్ రే ఫిల్మ్
* డయాగ్నోస్టిక్ కిట్లు
* కళ్ల అద్దాలు
* కేన్సర్ - డయాబెటిక్ మందులు
ఇతరాలు (ధరలు తగ్గేవి ఇవే)
* 15 హెచ్పీ దాటని విద్యుత్ డీజిల్ ఇంజన్లు
* ట్రాక్టర్ వెనుక టైర్లు - ట్యూబులు
* వేయింగ్ మిషన్లు
* యూపీఎస్‌లు
* విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు
* వైండింగ్ వైర్లు
* హెల్మెట్లు
* బాణసంచా
* లూబ్రికెంట్స్
* బైకులు
* రూ.100 లోపు సినిమా టికెట్లు
* గాలిపటాలు
* లగ్జరీ కార్లు
* మోటార్ సైకిళ్లు
* స్కూటర్లు
* ఎకానమీ క్లాస్ ఎయిర్ టికెట్లు
* రూ.7500 కంటే తక్కువ టారీఫ్ కలిగిన హోటళ్లు
* సిమెంట్
* ఇటుకలు
* ఎరువులు