Allu Arjun : ఇంటి లో మామూలుగానే ఉంటారు. కానీ సినిమా నచ్చితే ఎక్సైట్ అవుతారు : అల్లు అర్జున్
Allu Arjun, Dulkan, sawtvika, allu arvind
అల్లు అర్జున్ మాట్లాడుతూ..
నాకు దుల్కర్ గారంటే చాలా ఇష్టం. మలయాళం, తమిళం, హిందీ, తెలుగు ఇలా అన్నీ భాషల్లో అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ ఇలా ఆయన విజయాలు కొనసాగుతున్నాయి. ఆయన వెర్సటైల్ యాక్టర్. సినిమాల ఎంపిక కూడా చాలా బాగుంటుంది. చాలా స్వీట్ పర్సన్, వండర్‌ఫుల్ పర్సన్. కేరళలో మెగాస్టార్ మమ్ముట్టి గారి అబ్బాయి అయినప్పటికీ చాలా హంబుల్‌గా ఉంటారు. అందరినీ కలుపుకుంటూ వెళ్తారు. . అదే ఆయనకు మంచి సక్సెస్‌ను తీసుకొస్తుంది.
నిర్మాతగా కూడా ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన నిర్మించిన లోక సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఆకాశంలో ఒక తార ఆయన కెరీర్ లో మరో మైల్ స్టోన్ మూవీ అవుతుంది ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవుతున్న సాత్వికకు ఆల్ ది బెస్ట్. వెల్ కం టు తెలుగు సినిమా. శ్రుతి హాసన్ లాంటి కమర్షియల్ స్టార్ ఈ సినిమాలో కీలక పాత్ర చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే రుహాని కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తుంది.
జీవీ ప్రకాష్ఇరుముడి, లక్కీ భాస్కర్, విశ్వనాథన్ ఇలా వరుసగా మంచి సినిమాలు, విజయాలు అందిస్తున్నారు. పవన్ సాధినేని తొలి సినిమా ప్రేమ ఇష్క్ కాదల్ చాలా అద్భుతంగా తీశాడు. తనను పిలిపించి మాట్లాడాను. తను చాలా టాలెంటెడ్ డైరెక్టర్. సరైన సమయం వచ్చినప్పుడు తన టాలెంట్‌ను నిరూపించుకుంటాడని అనిపించింది. ఈ సినిమాలో ఆ ఎనర్జీ కనిపిస్తోంది. మా నాన్నగారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. విద్యా అక్క సీఈవోగా ఉన్నారు. స్వప్న కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. దత్తు గారి లెగసీని వారు ముందుకు తీసుకెళ్లడం చాలా ఆనందంగా ఉంది. వాళ్లు చాలా అద్భుతమైన సినిమాలను నిర్మిస్తున్నారు. వారి విషయంలో నాకు చాలా గర్వంగా ఉంది. గుణ్ణం గంగరాజు గారి కుటుంబం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వారికి ఆల్ ది బెస్ట్.
మా నాన్నగారు చాలా సినిమాలు చూస్తుంటారు. ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు మామూలుగానే ఉంటారు. కానీ ఈ సినిమా చూసి చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. సినిమా చాలా బాగుందని, మనసుకు బాగా నచ్చిందని చెప్పారు. ఆయన ఎప్పుడో కానీ అలా చెప్పరు. నా సినిమాల గురించి కూడా అంతగా చెప్పరు. అలాంటిది ఈ సినిమా గురించి అలా అన్నారంటే కచ్చితంగా ఇందులో మంచి సోల్ ఉందని అర్థం. ఈ సినిమాలో మొత్తం పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. ప్రతి అమ్మాయి కల నెరవేరాలనేది ఇందులోని ప్రధాన అంశం. చాలా బ్యూటిఫుల్ పాయింట్. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అభిమానులందరికీ థాంక్యూ.
హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.
సీతారామం తర్వాత ఈ కథ విన్నాను. కథ విన్నప్పుడే చాలా స్పెషల్‌గా అనిపించింది. కచ్చితంగా ఇది నా కెరీర్‌లో ఒక స్పెషల్ సినిమాగా నిలిచిపోతుందని నమ్ముతున్నాను. స్వప్నకు, అల్లు అరవింద్ గారికి థాంక్యూ. అల్లు అరవింద్ గారు చాలా డెడికేషన్‌తో వర్క్ చేస్తారు. ఆయన ఎంతో ఎనర్జీగా ఉంటారు. బహుశా బన్నీ గారు కూడా అంత ఎనర్జీగా ఉండటానికి కారణం అరవింద్ గారే.
సీతారామం తర్వాత ఈ కథ విన్నాను. కథ విన్నప్పుడే చాలా స్పెషల్‌గా అనిపించింది. కచ్చితంగా ఇది నా కెరీర్‌లో ఒక స్పెషల్ సినిమాగా నిలిచిపోతుందని నమ్ముతున్నాను. స్వప్నకు, అల్లు అరవింద్ గారికి థాంక్యూ. అల్లు అరవింద్ గారు చాలా డెడికేషన్‌తో వర్క్ చేస్తారు. ఆయన ఎంతో ఎనర్జీగా ఉంటారు. బహుశా బన్నీ గారు కూడా అంత ఎనర్జీగా ఉండటానికి కారణం అరవింద్ గారే.
జీవీ ప్రకాష్ ఈ సినిమా కథ విన్నప్పుడే బ్లాక్‌బస్టర్ అని చెప్పారు. తను ఒక సినిమా బాగుందని చెప్పాడంటే కచ్చితంగా అందులో ఏదో ప్రత్యేకత ఉంటుందని నాకు తెలుసు. అలాంటిది ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని చెప్పడం నాకు మరింత నమ్మకాన్ని ఇచ్చింది. డైరెక్టర్ పవన్ ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో పనిచేశారు. ఆయనకు కథపై చాలా క్లారిటీ ఉంది. సాత్విక అమెరికాలో పుట్టి పెరిగింది. తను నటి కావాలని అనుకున్నప్పుడు, ఆ కలను నిజం చేసుకునేందుకు ఒక నిర్ణయం తీసుకుంది. నిజంగా తను ఒక ఇన్‌స్పిరేషన్.
శ్రుతి హాసన్ ఈ సినిమాకు లైవ్ వైర్‌లా నిలిచారు. అద్భుతమైన ఎనర్జీతో నటించారు. తనతో కలిసి పనిచేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. బన్నీ గారికి సంబంధించిన ఒక మంచి సంఘటన మీతో పంచుకోవాలి. నా మొదటి సినిమా షూటింగ్ కేరళలోని ఒక పల్లెటూరిలో జరిగింది. అక్కడ నేను ఉంటున్న ఇంట్లో ఒక బీరువా మీద బన్నీ గారి ఫోటో ఉండేది. అప్పటికే ఆయన స్టార్‌గా ఎంతో పేరు సంపాదించారు. ఇప్పుడు గ్లోబల్ స్థాయికి చేరుకున్నారు. అల వైకుంఠపురములో నాకు ఫేవరెట్ సినిమా. కరోనా సమయంలో మా ఫ్యామిలీ అంతా కలిసి ఎన్నోసార్లు ఆ సినిమా చూశాం. అలాగే అల్లు అర్జున్ గారికి మా పాప పెద్ద ఫ్యాన్. ఆయన మా వేడుకకు రావడం ఎంతో ఆనందంగా ఉంది.ఆకాశంలో ఒక తార కచ్చితంగా మనమందరం గర్వపడే సినిమా అవుతుందని నమ్ముతున్నాను.

