శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. »
  3. ఆరోగ్యం
  4. »
  5. వ్యాధి
Written By పుత్తా యర్రం రెడ్డి

ఆస్తమా ఇలా ఉంటుంది...

ఉబ్బసం వ్యాధి వచ్చిందంటే ఇక ప్రాణపోయినట్లే అనుకుంటారు జనం దీన్ని అంటురోగంగా భావించి వ్యధిగ్రస్తులను దూరంగా పెడుతుంటారు. అయితే కాలం మారి పోయింది. కొత్త కొత్త మందులు మార్కట్‌లోకి వచ్చాయి. అప్పటి నుంచే ఈ వ్యాధి గ్రస్తులకు ఉపశమనం కలుగుతోంది. ఏదైనా కారణం కావచ్చు, అలర్జి కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఏ కారణాలు లేకున్నా ఈ వ్యాధి లక్షణాలు వచ్చే అవకాశముంది. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం వుంది.

ఉబ్బసం అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఉబ్బసం ఉన్న వ్యక్తులలో గాలి మార్గాల లోపలి భాగం వాచినట్టు అవుతుంది. ఈ వాపు మూలంగా గాలి మార్గాలు సన్న బడతాయి. ఎమైనా పడని రసాయనాలు మరియే ఇతర పదార్థాల వాసనలు గాలి ద్వారా పీల్చినప్పుడు లేదా నోటి ద్వారా తీసుకున్నప్పుడు ఈ సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.

ప్రతిఫలంగా వాటిగుండా ఊపిరితిత్తులకు తక్కువ గాలి చేరడం జరుగుతుంది. దీని మూలంగా ఊపిరి పీల్చినప్పుడు పిల్లి కూతలు, దగ్గు, ఛాతిపట్టినట్టుగా అనిపించడం, శ్వాస పీల్చుకోవడంలో కష్టం ముఖ్యంగా రాత్రి సమయంలో మరియు తెల్లవారు జామున ఇటువంటి లక్షణాలు కనబడుతాయి.

ఉబ్బసం అనేది పూర్తిగా తగ్గిపోయె జబ్బుకాదు. కాకపోతే తగినంత ముందు జాగ్రత్తలు తీసుకోవడం మూలాన వాటి మూలాన కలిగే లక్షణాల తీవ్రత, ఇబ్బందులను నివారించుకుంటూ రోగ్యకరమైన జీవితం గడపవచ్చు. ఉబ్బసం వల్ల కలిగే లక్షణాలు ప్రతిసారీ ప్రతి ఒక్కరిలో ఒకలాగా ఉండవు. కొన్ని తీవ్రతరంగా ఉంటాయి. త్రీవంగా ఉన్న ఉబ్బసంలో గాలి మార్గాలు చాలా వరకు మూసుకుపోవడం వలన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాలకు ప్రాణవాయువు అందడం కష్టమై పోతుంది.

ఇది వైద్య అత్యవసర పరిస్థితి, త్వరితగతిన వైద్య సహాయం అందని పక్షంలో ఇది ప్రాణాంతకం కూడా కాగలదు. ఉబ్బసం వున్న వ్యక్తులు ఏ కారణం చేత వారికి ఈ లక్షణాలు కలుగుతున్నాయో గుర్తించి అవి కలగకుండా చూసు కోవడం చాలా ముఖ్యం. మీ వైద్యుని సలహా మేరకు మందులు కూడా వాడుకోవచ్చును.

ఉబ్బసం అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీనిలో గాలి మార్గాలు ప్రభావితం అవుతాయి. గాలి మార్గాల ద్వారా ఊపిరితిత్తుల లోపలకు, లోపలి నుంచి వెలుపలకు గాలి ప్రసరిస్తుంది. ఉబ్బసం ఉన్న వ్యక్తులలో గాలి మార్గాల లోపలి భాగం వాచినట్టు అవుతుంది. ఈ వాపు మూలంగా గాలి మార్గాలు చాలా నాజుకుగా మారి, సన్న బడడం జరుగుతుంది.

ఎమైనా పడని రసాయనాలు మరియే ఇతర పదార్థాల వాసనలు గాలి ద్వారా పీల్చినప్పుడు లేదా నోటి ద్వారా తీసుకున్నప్పుడు ఈ సమస్య ఎక్కువయ్యే అవకాశం వుంటుంది. ఈ గాలి మార్గాలలో ఇటువంటి ప్రక్రియ మొదలైనప్పుడు (వాపు వున్నప్పుడు) వాపు తోటి ఈ మార్గాలు సన్నబడతాయి. ప్రతిఫలంగా వాటిగుండా ఊపిరితిత్తులకు తక్కువ గాలి చేరడం జరుగుతుంది. దీని మూలంగా ఊపిరి పీల్చినప్పుడు పిల్లి కూతలు, దగ్గు, ఛాతిపట్టినట్టుగా అనిపించడం, శ్వాస పీల్చుకోవడంలో కష్టం.

ముఖ్యంగా రాత్రి సమయంలో మరియు తెల్లవారు జామున ఇటువంటి లక్షణాలు కనబడుతాయి ఉబ్బసం అనేది పూర్తిగా తగ్గిపోయె జబ్బుకాదు. కాకపోతే తగినంత ముందు జాగ్రత్తలు తీసుకోవడం మూలాన వాటి మూలాన కలిగే లక్షణాల తీవ్రత, ఇబ్బందులను నివారించుకుంటూ ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చు.

ఉబ్బసం వల్ల కలిగే లక్షణాలు ప్రతిసారీ ప్రతి ఒక్కరిలో ఒకలాగా ఉండవు. కొన్ని తీవ్రతరంగా ఉంటాయి. త్రీవంగా ఉన్న ఉబ్బసంలో గాలి మార్గాలు చాలా వరకు మూసుకుపోవడం వలన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాలకు ప్రాణవాయువు అందడం కష్టమై పోతుంది. ఇది వైద్య అత్యవసర పరిస్థితి, త్వరితగతిన వైద్య సహాయం అందని పక్షంలో ఇది ప్రాణాంతకం కూడా కాగలదు.

ఉబ్బసం వున్న వ్యక్తులు ఏ కారణం చేత వారికి ఈ లక్షణాలు కలుగుతున్నాయో గుర్తించి అవి కలగకుండా చూసు కోవడం చాలా ముఖ్యం. మీ వైద్యుని సలహా మేరకు మందులు కూడా వాడుకోవచ్చును.

కారాణాలు చాలా ఉన్నాయి.
వాతావరణంలో ఉన్న కొన్ని పదార్థాల మూలంగా ఉబ్బసం లక్షణాలు కనపడతాయి. కొన్ని సాధారణ విషవాయువులు, అలర్జీ కలిగించే పదార్థాలు, వైరల్ ఇన్ ఫెక్షన్ గానీ, వ్యాయామం చేయునప్పుడు గానీ మాత్రమే ఈ లక్షణాలు కనబడుతాయి.

ధూళిలో వున్న క్రిములు బొద్దింకలు చెట్ల నుండి రాలు, గడ్డిలో వుండు పుప్పొడి. బూజు,ధూమపానం, గాలిలోని కలుషితాల కారణంగా వ్యాధి సోకుతుంది. చల్లని గాలి, వాతావరణ మార్పులు వంట నుండి వెలువడు మరియు గోడలకు వేయు పెయింటి నుండి వెలువడు ఆవిరులు అత్తర్ ఏస్ర్పిన్ మరియు బీటా, బ్లాకర్స్ వంటి మందులు మానసిక ఒత్తిడి, ఏడుపు, నవ్వు వంటి హావభావాలు అధిక మోతాదులో ప్రకటించడం వలన వ్యాధి పెరిగే అవకాశం ఉంది.

కొన్ని నిల్వ ఉంచిన ఆహార పదార్థాలలో వున్న సల్పైడ్స్ (ఎండు ఫలాలు), మత్తు పానీయాలు గాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్ల్ క్స్ అను జబ్బులో ఉన్న ఆహార పదార్థాలు అన్నాశయం నుండి అన్నవాహికలోనికి తిరిగి రావడం మూలాన ఛాతిలో మంట కలిగి, ఉబ్బసం లక్షణాలు అధికం అయ్యే అవకాశం ఉంటుంది.