శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: గురువారం, 16 జూన్ 2016 (16:50 IST)

ఆరోగ్య ఖజనా ఖర్జూరం... ఇవి తినాల్సిందే...

ఖర్జూరాలను ప్రొటీన్ పవర్ హౌస్ అంటారు. ఆ ఎడారి పళ్ళకున్న విశిష్టత అంతాఇంతా కాదు. ఏ పండైనా మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తియ్యగా ఉంటుంది. ఖర్జూరాలతో తయారుచేసే ఆహార పదార్ధాలను, ఖర్జూరాలను రంజాన్ సమయంలో ముస్లింలు ఇష్టంగా తీసుకుం

ఖర్జూరాలను ప్రొటీన్ పవర్ హౌస్ అంటారు. ఆ ఎడారి పళ్ళకున్న విశిష్టత అంతాఇంతా కాదు. ఏ పండైనా మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తియ్యగా ఉంటుంది. ఖర్జూరాలతో తయారుచేసే ఆహార పదార్ధాలను, ఖర్జూరాలను రంజాన్ సమయంలో ముస్లింలు ఇష్టంగా తీసుకుంటారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష పూర్తయ్యాక చాలామంది ఖర్జూరాలను తీసుకుంటారు. ఖర్జూరాలలో అధిక మోతాదులో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. 
 
ఈ పండ్లను తినడం వల్ల ఇన్ఫెక్షన్‌లను తట్టుకునే వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. రక్తస్రావాన్ని అరికడతాయి. శరీరానికి చక్కని శక్తిని అందిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి, గుండెజబ్బులు దూరమవుతాయి. రక్తపోటును తగ్గిస్తాయి. ఎముకలలో పటుత్వాన్ని పెంచుతాయి. ఉదర సంబంధమైన వ్యాధులను ఈ పండ్లు అరికడుతాయి. గర్భణీలు ప్రసవానికి ముందు కనీసం నాలుగు వారాల నుండి రోజుకు నాలుగు ఖర్జూరాలను తింటే ప్రసవం సులువుగా అవుతుంది. 
 
రక్తహీనత సమస్యను అరికడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఎండాకాలంలో ఖర్జూరాలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే వడదెబ్బ నుండి తప్పించుకోవచ్చు. ఈ పండ్లలోని టానిన్ పెద్ద పేగులోని సమస్యలకు చెక్ పెడుతుంది. ఖర్జూరాల నుండి తీసిన గుజ్జును తీసుకుంటే జలుబు, శ్లేష్మం, గొంతునొప్పి త్వరగా తగ్గిపోతుంది. కిడ్నీలోని రాళ్ళను కరిగించగల శక్తి ఖర్జూరానికి ఉంది. యూరినల్ ఇన్ఫెక్షన్లలను నియంత్రిస్తుంది.