శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (20:11 IST)

కీళ్ళనొప్పులతో బాధపడే మహిళలకు చెర్రీ జ్యూస్ దివ్యౌషధం

చెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. నిద్రలేమి చాలా మందిని బాధపెడుతున్న సమస్య. దీని కారణంగా చాలా మంది క్రానిక్‌ పెయిన్‌, హైబిపి, టైప్‌2 డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. మెలటోనిన్

చెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. నిద్రలేమి చాలా మందిని బాధపెడుతున్న సమస్య. దీని కారణంగా చాలా మంది క్రానిక్‌ పెయిన్‌, హైబిపి, టైప్‌2 డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. మెలటోనిన్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉండే ఈ చెర్రీలు తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది.  అయితే ఇవి రోజు ఒకటి లేదా రెండు తీసుకోవాలి. దీర్ఘకాలికంగా వాడటం ప్రాణానికే ప్రమాదం. ఈ పండ్లను డైరెక్ట్‌గా తినడంకంటే జ్యూస్‌ చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి. 
 
పెయిన్‌కిల్లర్స్‌కు బదులు చెర్రీస్‌ను తీసుకోవడం మంచిదంటున్నారు వైద్యులు. వీటివల్ల వ్యాయామం సమయంలో వచ్చే నొప్పి చాలా వరకు తగ్గుతుంది. చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్నాయి. ఇవి మంచి రంగును ఇస్తాయి. కీళ్ళనొప్పులతో బాధపడే మహిళలు చెర్రీ జ్యూస్‌ను రోజూ రెండు సార్లు మూడు వారాలపాటు తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. కొవ్వు తక్కువగా ఉండే ఈ పండ్లు తినడం వల్ల లావు తగ్గొచ్చు.