ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: సోమవారం, 27 మార్చి 2017 (22:43 IST)

టెన్షన్... టెన్షన్... మానసిక ఒత్తిడితో జ్ఞాపకశక్తి దూరం

మానసిక ఒత్తిడివల్ల మనిషి అనేకరకాల రుగ్మతలకు గురవుతున్నాడు. దాంతోపాటు చికాకు, నిద్రలేమి, ఆందోళన లాంటివి సైతం మనిషిని వేధిస్తున్నాయి. అయితే ఇవన్నీ కాకుండా మానసిక ఒత్తిడివల్ల మనిషి జ్ఞాపకశక్తి సైతం నశించే అవకాశముందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కొందరు

మానసిక ఒత్తిడివల్ల మనిషి అనేకరకాల రుగ్మతలకు గురవుతున్నాడు. దాంతోపాటు చికాకు, నిద్రలేమి, ఆందోళన లాంటివి సైతం మనిషిని వేధిస్తున్నాయి. అయితే ఇవన్నీ కాకుండా మానసిక ఒత్తిడివల్ల మనిషి జ్ఞాపకశక్తి సైతం నశించే అవకాశముందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కొందరు ఔత్సాహిక పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల ప్రకారం దీర్ఘకాలికంగా ఒత్తిడితో బాధపడేవారికి జ్ఞాపకశక్తి నశించిపోతోందని తేలింది. 
 
అలాగే ఒత్తిడి వల్ల కలిగే ఆందోళన, మానసికంగా కుంగిపోవడం లాంటి లక్షాణాలు మనిషిలోని విషయ సంగ్రహణశక్తిని దెబ్బతీస్తాయని కూడా ఈ పరిశోధనలు తెల్చాయి. ఈ పరిశోధనల ప్రకారం మానసిక వ్యధకు, విషయ సంగ్రహణశక్తికి మధ్య సంబంధం ఉన్నట్టు తేలింది. కాబట్టి జీవితంలో అనేక రుగ్మతలతో పాటు జ్ఞాపకశక్తి నాశనానికి సైతం దారితీసే ఈ మానసిక ఒత్తిడిని జయించాల్సి అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 
 
ఇందుకోసం యోగా, ధ్యానం, వ్యాయామాలు చేయడం లాంటి చర్యలు చేపట్టాల్సిందిగా వారు సూచిస్తున్నారు. అలాగే ఆహ్లాదకరమైన వాతావరణంలో నివశించడం జీవితంలో ఎదురయ్యే సవాళ్ల గురించి పాజిటీవ్‌గా ఆలోచించడం లాంటివి చేయాలని వారు పేర్కొంటున్నారు.