సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (12:49 IST)

సలాడ్స్‌ను షాపుల్లో కొని లాగిస్తున్నారా? కాస్త ఆగండి..(video)

సలాడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గ్రీన్ సలాడ్, ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్, స్ప్రౌట్ సలాడ్స్ అనే రకరకాల సలాడ్స్ ఆరోగ్యానికి పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్లను అందిస్తాయి. సలాడ్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యమే కాకుండా అందం కూడా సొంతం అవుతుంది. సలాడ్స్‌లో కొవ్వు శాతం ఉండదు కాబట్టి గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉండవు. 
 
ముఖ్యంగా ఒబిసిటీతో బాధపడుతున్న వారు ప్రతిరోజు సలాడ్స్ తీసుకుంటే బరువు తగ్గుతారు. సలాడ్స్ తీసుకోవడం ద్వారా మధుమేహం, రక్తపోటును నియంత్రించుకోవచ్చు. సలాడ్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తాన్నిశుద్ధి చేస్తాయి. రక్తసరఫరాణను మెరుగుపరుస్తాయి. రోజూ ఓ కప్పు సలాడ్స్ తీసుకోవడం ద్వారా ఎముకలకు బలాన్నిచ్చిన వారం అవుతాం. వీటిలోని ఫైబర్.. చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెడుతుంది. సలాడ్స్‌ను రోజూ తీసుకుంటే ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. ఇంకా బ్రెస్ట్, మౌత్ క్యాన్సర్లను నివారించవచ్చు. 
 
అలాగే సలాడ్స్‌ను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా కండరాల పనితీరు మెరుగుపడుతుంది. గుండెకు మేలు జరుగుతుంది. చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. అయితే సలాడ్స్‌ను బయటి షాపుల్లో కొనుక్కోకూడదు. అందులో కేలరీలు అధికంగా కలిగిన ఫ్లేవర్లు, ప్రోసెస్ చేసిన ఫుడ్స్ కలుపుతారు. అందుచేత ఇంట్లోనే సలాడ్స్ చేసుకోవడం.. రోజుకో వెరైటీ సలాడ్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.