చిన్న పనికే అలసటా? ఒత్తిడికి గురైతే పది నిమిషాలు నడవండి.. టెన్షన్ వద్దే వద్దు..!

చిన్న పనికే అలసిపోతుంటే.. శరీరంలో శక్తిస్థాయిలు తగ్గిపోతున్నాయని గమనించాలి. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. రోజూ వ్యాయామం చేయటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రోజంతా ఎంతో ఉల్లాసాన్ని కూడా కల్గిస

శనివారం, 30 జులై 2016 (11:37 IST)
చిన్న పనికే అలసిపోతుంటే.. శరీరంలో శక్తిస్థాయిలు తగ్గిపోతున్నాయని గమనించాలి. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. రోజూ వ్యాయామం చేయటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రోజంతా ఎంతో ఉల్లాసాన్ని కూడా కల్గిస్తుంది. ఇలా చేయటం ఆరోగ్యానికి ఎంతో మేలు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ చేయడంతో రోజు మొదలవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా ప్రోటిన్స్‌ ఉన్న సోయాసాస్‌, గుడ్లు, పాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. 
 
ఉదయాన్నే వచ్చే సూర్య కిరణాలు శరీరంపై పడే విధంగా పది నిమిషాలు ఎండలో ఉండటం మంచిది. సూర్య కిరణాలు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. చాలా రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి, దాంటో పాటు శరీరానికి అవసరమైన విటమిన్‌ 'డి' కూడా అందుతుంది. రోజు తినే ఆహారంతో పాటు, స్నాక్స్‌ కూడా తీసుకుంటే మంచిది. స్నాక్స్‌లో ఆయిలీ ఫుడ్‌కు బదులుగా ఫ్రూట్స్‌, జ్యూస్‌, ఉడకబెట్టిన గింజలు తీసుకోవాలి. ఇది తాత్కాలికంగా శరీరానికి ఉపశమనం కల్గిస్తుంది. 
 
రోజూ మధ్యాహ్నం పూట పావు గంట నిద్రపోతే.. ఒత్తిడి మాయమైపోతుంది. ఆఫీసుల్లో పని చేస్తున్నప్పుడు తొందరగా ఒత్తిడికి గురవుతుంటే.. అయితే పది నిమిషాలు లేచి అటు ఇటు నెమ్మదిగా నడవటం మంచిది. శరీరానికి అవసరమైనంత నీరు అందకుంటే డిహైడ్రేట్‌ అవుతుంది. ఇది ఒకరకమైన ఒత్తిడికి గురి చేస్తుంది. ఎక్కడున్నా ఒక వాటర్‌ బాటిల్‌ను వెంట ఉంచుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

భార్యకు మోకాళ్ల నొప్పులు.. ఆటోమేటిక్ మెట్లు తయారు చేసిన భర్త (video)

ముంబైకి రెడ్ అలర్ట్- వారాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు (video)

శనివారం నుండి పాపికొండలకు పర్యాటక పడవ సేవలు పునఃప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో జూలై 4, 2026 నాటి వాతావరణం ఎలా వుంది...?

ప్రేయసికి నిశ్చితార్థం.. వివాహిత ప్రియుడి బెదిరింపులు.. పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

అన్నీ చూడండి

Jyothi Poorvaj : ఏంజెలీనా జోలిని తలపించేలా కిల్లర్... జ్యోతి పూర్వజ్ లుక్స్

Prithviraj : బ్యాంక్ ఉద్యోగిగా బ్యాంకు దోపిడీ చేసి ఐ, నోబడీ అంటోన్న పృథ్వీరాజ్ సుకుమారన్

M. M. Keeravani: ఎం. ఎం.కీరవాణి తో ఇష్టమైన పాటలు పంచుకున్న అభిమానులు

Trisha: త్రిష నటించిన జననాయకుడు కంటే విశ్వంభర విడుదలకు సిద్ధమవుతోంది !

కామాఖ్య నుంచి హార్ట్ ఫుల్ మెలోడీ ఏముందో ఏమో సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments