శరీరంలో పేరుకుపోతున్న కొవ్వును కరిగించాలంటే...

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 6 డిశెంబరు 2019 (20:15 IST)
ఇప్పుడు ఎక్కువగా కూర్చుని చేసే ఉద్యోగాలు ఎక్కువయ్యాయి. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతోంది. మరోవైపు శరీరానికి కావలసిన సరైన వ్యాయామం, పౌష్టికాహారం చాలామంది తీసుకోవడం లేదు. దీంతో శరీరంలో కొవ్వు శాతం అధికంగా పేరుకుపోతోంది. 
 
శరీరంలో పేరుకుపోతున్న కొవ్వును కరిగించాలంటే... రుతువులకు తగ్గట్టు లభించే కూరగాయలు, పండ్లు, పీచుపదార్థాలు కలిగిన ఆహార పదార్థాలను సేవిస్తుండాలి. ముఖ్యంగా క్రమంతప్పకుండా వారానికి ఒకసారి సగ్గు బియ్యం ఉడకబెట్టుకుని అందులో పాలు, చక్కెర కలుపుకుని సేవిస్తే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందంటున్నారు వైద్యులు. 
 
అలాగే తక్కువ చక్కెర కలిగిన ఆహార పదార్థాలను సేవించండి. పాలు, టీ, కాఫీ, తీపి పదార్తాలు తీసుకునేటప్పుడు తక్కువ శాతం చక్కెర ఉండేలా చూసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా చాలామంది పెరుగులో చక్కెర కలుపుకుని తింటుంటారు. ఇలా తింటే వారి ఆరోగ్యానికి చాలా ప్రమామదం. శరీరంలో కొవ్వు శాతం పెరగడమే కాకుండా మధుమేహానికి దారి తీస్తుందంటున్నారు వైద్యులు. 
 
ప్రధానంగా మాంసాహారులైతే మాంసాన్ని సేవించడం తగ్గించండి. దీంతో శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోదు. అలాగే ప్రకృతిపరంగా లభించే ఆహార పదార్థాలను నిత్యం క్రమం తప్పకుండా వాడుతుంటే రక్తంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
ఆహార నియమాలను పాటించాలి. నియమానుసారం వ్యాయామం చేస్తుండాలి. పీచుపదార్థాలను ఎక్కువగా తీసుకుంటుండాలి. దీంతో శరీరంలోని బరువు, కొవ్వును తగ్గించవచ్చు. క్రమం తప్పకుండా నియమానుసారం వ్యాయామం, భోజనం సరైన మోతాదులో తీసుకుంటుంటే ఎలాంటి మందులు లేకుండానే శరీరంలోని కొవ్వును తగ్గించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అన్నీ చూడండి

Rahul Gandhi: జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ.. ఎత్తుకెళ్లిన పోలీసులు

బ్రిటన్‌లో తొలి ఏఐ మంత్రిగా భారతీయుడు

Mysuru: భార్య, ఇద్దరు కుమార్తెల గొంతు నులిమి చంపేసిన భర్త

దారుణం, రెండ్రోజుల వయసున్న ఆడ శిశువును సంచీలో పెట్టి రోడ్డుపక్కన వదిలేసారు

తిరుగుబాటు నేతలను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు : మమతా బెనర్జీ

అన్నీ చూడండి

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై ప్రశ్నాస్త్రాలను సంధించిన సుప్రీం కోర్టు

తర్వాతి కథనం
Show comments