శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 4 డిశెంబరు 2019 (21:49 IST)

నల్లటి వలయాలు కంటి కింద అందాన్ని అపహాస్యం చేస్తున్నాయా?

నల్లటి వలయాలు కళ్ల కింద చాలామందిని ఇబ్బందిపెడుతుంటాయి. ఈ నల్లటి చారల వల్ల కంటి సౌందర్యం దెబ్బతింటుంది. దీనికి ప్రకృతిలో దొరికే వస్తువులతోనే నివారించవచ్చు. కొబ్బరినీటిని కంటిచుట్టూ రాయాలి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తూ ఉంటే కళ్లు చుట్టూ ఉన్న నలుపు పోతుంది. దోసకాయను చక్రాలుగా కోసి కంటి రెప్పలపై పదినిమిషాలు ఉంచాలి. బంగాళాదుంప రసాన్ని పూసినా ఫలితం ఉంటుంది. 
 
కళ్లు ఎరుపుగా ఉండి నీరు కారుతుంటే... నీరుల్లిపాయల రసం ఒకటి, రెండు చుక్కలు కంటిలో వెయ్యాలి. పసుపునీరు బాగా మరగించి, వడబోసి తాగితే ఫలితం ఉంటుంది. వేపాకు భస్మాన్ని నిమ్మరసంతో కలిపి కంట్లో పెట్టుకుంటే కంటి ఎరుపు, నీరు కారడం తగ్గుతాయి. బంగాళాదుంప తురుము కంటిపై వేసి పది నిమిషాలయ్యాక తీసివేయాలి. తెల్ల కాకరకాయ కండ్లకు చలువ చేస్తుంది.