శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 21 నవంబరు 2019 (17:48 IST)

శుభోదయం, నిద్ర లేవగానే ఎవరిని చూస్తారు? (video)

పూర్వం నిద్రలేవగానే ఆవును లేదా అద్దాన్నీ గానీ తల్లిదండ్రులు, భార్యను చూడటం ఆచారంగా కనిపిస్తుంది. 'అద్దం' లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పబడుతోంది. ఈ కారణంగా ఉదయాన్నే అద్దం చూడటం వలన లక్ష్మీదేవి మోమును చూసినట్టు అవుతుంది.
 
ఇక ఆవు సకలదేవతా స్వరూపమని సర్వ శాస్త్రాలు చెబుతున్నాయి కనుక, ఆవును చూడటం వలన సమస్త దేవతలను దర్శించినట్టు అవుతుంది. ఇక అర్థాంగి ఎప్పుడూ కూడా తన భర్త శ్రేయస్సునే కోరుకుంటుంది. ఆయన కోసమే వ్రతాలు ... నోములు చేస్తూ ఉంటుంది. అందువలన ఇంటికి దీపంలాంటి ఇల్లాలి ముఖాన్ని చూడటం వలన అంతా మంచే జరుగుతుందని అంటారు.
 
ఇక తల్లిదండ్రులు పిల్లల శ్రేయస్సే కోరుకుంటారు కాబట్టి.. ఉదయాన్నే వారిని చూడటం వలన లక్ష్మీనారాయణులను ... శివపార్వతులను దర్శించిన ఫలితం కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.